Weekly Horoscope:Weekly Horoscope (August 17 to 23): వారఫలాలు.. ఈ రాశుల వారికీ కష్టాలు ఎక్కువ..
Weekly Horoscope:Weekly Horoscope (August 17 to 23): వారఫలాలు.. ఈ రాశుల వారికీ కష్టాలు ఎక్కువ.. ఈ వారం గ్రహ సంచారం: వృషభంలో చంద్రుడు, మిథునంలో గురు-శుక్రులు, సింహరాశిలో రవి, కన్యలో కుజుడు, మీనంలో శని ఉన్నారు. ఈ గ్రహ స్థితుల వల్ల అనేక రాశులకు శుభ ఫలితాలు కలగనున్నాయి. గ్రహ అనుకూలత తక్కువగా ఉన్నవారికి తగిన పరిహారాలు కూడా సూచించబడ్డాయి. మేషం నుండి మీనం వరకు 12 రాశుల రాశిఫలాలు గ్రహచార ఆధారంగా ఇలా ఉన్నాయి:

మేషరాశి:
ఈ వారం శని దేవుడి శుభ దృష్టి మీపై ఉంది. అనుకున్న పనులు సఫలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి, పెట్టుబడులకు అనుకూలం. వారం ప్రారంభం శుభకరం. ప్రభుత్వ సంబంధిత పనులు సులభంగా పూర్తవుతాయి. అయితే, వారం మధ్యలో కొంత అశాంతి, మానసిక అస్థిరత ఉండవచ్చు. పని ఒత్తిడి, శ్రమాధిక్యం సంభవం. ఖర్చులపై జాగ్రత్త వహించండి, విలాసాలకు డబ్బు ఖర్చవుతుంది. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. శివారాధన మీకు మంచి ఫలితాలనిస్తుంది.

వృషభరాశి:
శుక్రుడు ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నాడు. శుభ సంఘటనలు జరుగుతాయి. బుధ, గురు, శుక్రవారాలు మీకు అత్యంత అనుకూలం. పెట్టుబడులకు ఇది మంచి సమయం. బంధు, మిత్రులతో ఆనందకర సమయం గడుస్తుంది. చురుకుగా ఉండండి, లేకపోతే అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది. బంగారం, రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూలం. వృత్తి నిపుణులకు శుభవార్తలు. దుర్గాదేవికి కుంకుమపూజ చేయించడం మంచి ఫలితాలనిస్తుంది.

మిథునరాశి:
ఈ వారం గ్రహబలం మీకు అనుకూలంగా ఉంది. మిత్రుల సహకారంతో పనులు సఫలం అవుతాయి. సోమ, మంగళ, గురువారాలు శుభకరం. జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు అనుకూలం, కానీ జూదానికి దూరంగా ఉండండి. అప్పులు ఇవ్వడం మానండి. వ్యాపారులకు వ్యాపార వృద్ధి కనిపిస్తుంది. విలువైన పత్రాలు జాగ్రత్తగా ఉంచండి, దొంగతనం జరిగే అవకాశం ఉంది. పంచముఖి హనుమంతునికి కొబ్బరికాయ, తమలపాకులు సమర్పించండి.

కర్కాటకరాశి:
చంద్రుడితో పాటు అనేక గ్రహాల శుభ దృష్టి మీపై ఉంది. అయితే, వారం ప్రారంభంలో సోమ, మంగళవారాల్లో శత్రు భయం, తెలియని ఆందోళన, ఉదర సంబంధిత ఇబ్బందులు రావచ్చు. వారం మధ్య నుండి అనుకూలం. మీ మాటకు విలువ పెరుగుతుంది, ధనలాభం సూచితం. వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు, ఉద్యోగులకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. బుధ, గురు, శుక్రవారాలు అనుకూలం. రోజూ శివాలయంలో పరమేశ్వరుని దర్శనం చేసుకోండి.

సింహరాశి:
రవి మీకు అనుకూలంగా ఉన్నాడు, కానీ మిగతా గ్రహబలం సామాన్యంగా ఉంది. సమాజంలో మీ విలువ పెరుగుతుంది, ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం. సోమ, శనివారాలు అనుకూలం, కానీ మిగతా రోజుల్లో ఇబ్బందులు రావచ్చు. శత్రువులు, వ్యాపార భాగస్వాములతో విభేదాలపై జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగులకు అనుకూలం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వారం మధ్యలో నిందలు రావచ్చు. అమ్మవారికి రాహుకాలంలో నిమ్మ దీపారాధన చేయించండి.

కన్యారాశి:
బుధుడి అనుకూల దృష్టి ఉంది. వ్యాపారంలో విజయం, ధనలాభం కనిపిస్తుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు. గురువారం స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు అనుకూలం, లాభాలు వస్తాయి. కుటుంబంతో ఆనంద సమయం. రాజకీయ నాయకులకు శుభకరం. ఆరోగ్యం, ఖర్చులపై జాగ్రత్త. పనులు ప్రారంభించే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఎవరికీ అప్పు హామీ ఇవ్వవద్దు. శివారాధన మంచి ఫలితాలనిస్తుంది.

తులారాశి:
శుక్రుడి అనుకూల దృష్టి బలంగా ఉంది. వారం ప్రారంభం శుభకరం. వ్యాపార లక్ష్యాలు సాధిస్తారు, ధన వృద్ధి ఉంది. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు. టెక్నికల్, చేతివృత్తి వారికి కొత్త అవకాశాలు. గురువారం ఆకస్మిక అవకాశం. శనివారం భూమి పెట్టుబడులకు అనుకూలం. అప్పులు ఇవ్వడం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శుభం. విష్ణు సహస్రనామ జపం అనుకూలతలను పెంచుతుంది.

వృశ్చికరాశి:
కుజుడి అనుకూల దృష్టి ఉంది. వారం ప్రారంభంలో కొంత ఇబ్బందులు, కానీ కొత్త పరిచయాలు, వ్యాపార వృద్ధి అవకాశాలు కనిపిస్తాయి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. స్త్రీలకు ఈ వారం అనుకూలం. కుటుంబంతో ఆనందం, పిల్లల విషయంలో శుభవార్తలు. మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎర్ర పూలతో అర్చన చేయించండి. ఈశ్వర ఆరాధన, సూర్య నమస్కారం శుభం చేకూరుస్తాయి.

ధనూరాశి:
గురుడి అనుకూల దృష్టితో శుభ ఫలితాలు కలుగుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి, జీవిత భాగస్వామితో సంతోషం. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్, మీడియా వృత్తుల వారికి అనుకూలం. వాహన డ్రైవింగ్‌లో, సోదరులతో జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో శ్రద్ధ అవసరం. వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పణ, స్తోత్ర జపం శుభం.

మకరరాశి:
శని వక్ర దృష్టి ప్రభావం తీవ్రంగా ఉంది, గ్రహబలం మిశ్రమంగా ఉంది. వివాదాలు, మానసిక ఆందోళన, ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ఉద్యోగులు అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కొంత అనుకూలం. టీచర్లు, వృత్తి నిపుణులకు సానుకూలం. రియల్ ఎస్టేట్ వారికి మంచిది, కానీ కిరాణా వ్యాపారులకు అంత అనుకూలం కాదు. నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన మంచి ఫలితాలనిస్తాయి.

కుంభరాశి:
శని వక్ర దృష్టి తీవ్రంగా ఉంది, ఆకస్మిక ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలం కాదు. పెద్దల ఆశీర్వాదంతో పనులు ప్రారంభించండి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. ఉద్యోగులకు ఆఫీసులో ఇబ్బందులు, పెట్టుబడులకు అనుకూలం కాదు. భూమి పెట్టుబడులకు మాత్రం శుభం. గురు, శుక్ర, శనివారాలు అనుకూలం. నవగ్రహ ప్రదక్షిణ, ఈశ్వరారాధన ఇబ్బందులను తొలగిస్తాయి.

మీనరాశి:
గురుడి అనుకూల దృష్టితో శుభాలు కలుగుతాయి. వారం ప్రారంభం కొంత అనుకూలత తక్కువ, కానీ బుధవారం నుండి శుభ ఫలితాలు. అప్పు ఇవ్వడం మానండి. విద్యార్థులకు జ్ఞాపకశక్తి బాగుంటుంది. కోర్టు తీర్పులు, కాంట్రాక్టర్ల బిల్లులు అనుకూలం. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. క్రియేటివ్ ఫీల్డ్‌లో వారికి అద్భుత వారం. వారం మధ్యలో ఖర్చులు జాగ్రత్త. మూగజీవాలకు ఆహారం ఇవ్వండి, దత్తాత్రేయ దర్శనం శుభ ఫలితాలనిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

