BusinessToday gold rate

Today Gold Rate:షాకిస్తున్న బంగారం ధరలు.. ఇలా ఉంటే కొనటం కష్టమే..

Today Gold Rate:షాకిస్తున్న బంగారం ధరలు.. ఇలా ఉంటే కొనటం కష్టమే.. బంగారం ధర ఆల్-టైం గరిష్ట స్థాయికి సమీపంలో ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోలిస్తే, నేడు బంగారం ధర స్థిరంగా ఉందని చెప్పవచ్చు. నీటి బంగారం, వెండి ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.ఈ రోజు, ఆగస్టు 22, 2025, శుక్రవారం నాడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి:

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹1,02,460
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర: ₹92,700
1 కేజీ వెండి ధర: ₹1,17,096

బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరల పెరుగుదల. గత ఒక నెలగా బంగారం ధర లక్ష రూపాయలకు పైగా ట్రేడ్ అవుతోంది. స్వల్ప ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, బంగారం ధర ఆల్-టైం రికార్డు స్థాయికి సమీపంలో స్థిరంగా ఉంది.

గత ఏడాదిగా అంతర్జాతీయ మార్కెట్లలో జరిగిన పరిణామాలు, ముఖ్యంగా అమెరికా మార్కెట్లపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నెగటివ్ ధోరణి కారణంగా, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. బంగారం సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది, దీంతో ఇన్వెస్టర్లు దీనిపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు.

ఇక వెండి ధరల విషయానికొస్తే, బంగారంతో పాటు వెండి ధర కూడా గణనీయంగా పెరిగింది. వెండి ధర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో, ఒక కేజీకి ₹1.28 లక్షల వరకు చేరుకుంది. బంగారంతో పోటీపడుతూ వెండి ధర కూడా పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు వెండిపై కూడా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.

వెండికి పెరుగుతున్న డిమాండ్‌కు ప్రధాన కారణం పారిశ్రామిక రంగంలో దాని ఉపయోగం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు, దీంతో దాని ధర గణనీయంగా పెరుగుతోంది.

Disclaimer: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం వంటి పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీ పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాల వల్ల కలిగే లాభనష్టాలకు chaipakodi ఎటువంటి బాధ్యత వహించదు. డబ్బు, పెట్టుబడి, వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని chaipakodi సూచిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."