Face Glow Tips:మీరు ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా.. ఈ ప్యాక్ ట్రై చేయండి..
Face Glow Tips:మీరు ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలా.. ఈ ప్యాక్ ట్రై చేయండి.. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే కొన్ని సహజ ఉత్పత్తులను ఉపయోగించడం ఉత్తమం. మనకు సులభంగా లభించే ఓట్స్, ముఖాన్ని యవ్వనంగా, బిగుతుగా మార్చడంతో పాటు ముడతలు రాకుండా నిరోధిస్తుంది.

వయసు మీద పడుతుండగా ముఖంపై ముడతలు రావడం సహజం. చర్మం వదులుగా మారి, ముఖంలోని అందం తగ్గుతుంది. ముడతలు కనిపించగానే చాలా మంది ఖరీదైన క్రీములను ఉపయోగిస్తారు. ఈ క్రీములు రాసినంత కాలం ముఖం యవ్వనంగా కనిపించినట్లు అనిపిస్తుంది, కానీ వాటిని ఆపగానే చర్మం మళ్లీ కళ తప్పుతుంది.

అలాంటి సమస్యలను నివారించడానికి సహజ ఉత్పత్తులు ఉపయోగించడం మంచిది. ఓట్స్, ముఖాన్ని యవ్వనంగా మార్చడంతో పాటు, ముడతలు రాకుండా చేసి, చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. ఓట్స్‌తో పాటు మరో పదార్థాన్ని కలిపి ఉపయోగిస్తే ముఖం అందం రెట్టింపు అవుతుంది. ఆ పదార్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఓట్స్ మరియు కీరదోసకాయ ఫేస్ ప్యాక్:
ఓట్స్ మరియు కీరదోసకాయను కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకుంటే ముఖం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఈ రెండింటినీ కలిపి పేస్టులా తయారు చేసి రాస్తే ముడతలు రాకుండా నిరోధించి, మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది.

ఫేస్ ప్యాక్ తయారీ విధానం:
కీరదోసకాయను మెత్తగా తురుముకోవాలి.తురిమిన కీరదోసకాయలో 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి బాగా కలపాలి.మెత్తని పేస్టులా తయారైన మిశ్రమాన్ని ముఖానికి సమానంగా అప్లై చేయాలి.20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగిస్తే ముఖం యవ్వనంగా, ముడతలు లేకుండా కనిపిస్తుంది.

అరటిపండు మరియు పెరుగు ఫేస్ ప్యాక్:
అరటిపండును పెరుగులో కలిపి మెత్తని పేస్టులా తయారు చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్‌ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చర్మం బిగుతుగా, యవ్వనంగా మారుతుంది. అరటిపండు చర్మానికి పోషణను అందిస్తుంది, పెరుగు చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది.

జాగ్రత్తలు:
ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, బిగుతుగా ఉంటుంది. అయితే, ఏదైనా పదార్థాన్ని ముఖానికి అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం ముఖ్యం. చర్మంపై ఎలాంటి సమస్య లేకపోతేనే ఈ ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించాలి. ఈ సహజ పద్ధతులతో మీ చర్మ సమస్యలను తగ్గించుకొని, యవ్వనమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

