Amazon OffersBusinessMovies

Amazon Prime Vs Flipkart Black:అమెజాన్‌ ప్రైమ్‌ vs ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్.. ఏది బెటర్..?

Amazon Prime Vs Flipkart Black:అమెజాన్‌ ప్రైమ్‌ vs ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్.. ఏది బెటర్.. పండగ సీజన్‌ సమీపిస్తుండటంతో ఇ-కామర్స్‌ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్స్‌’, ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్స్‌’ పేరుతో భారీ ఆఫర్లతో ముందుకు రానున్నాయి.

ఇలాంటి సేల్స్‌ సమయంలో ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు ఒక రోజు ముందుగానే షాపింగ్‌ అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ ప్రైమ్‌కు పోటీగా ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవల ‘బ్లాక్‌ మెంబర్‌షిప్‌’ను ప్రవేశపెట్టింది. ఈ రెండు సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లలో ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

సబ్‌స్క్రిప్షన్‌ ధరలు
అమెజాన్‌ ప్రైమ్‌: నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.299, త్రైమాసికం రూ.599, ఏడాది ప్లాన్‌ రూ.1,499. అదనంగా ప్రైమ్‌ లైట్‌ రూ.799, ప్రైమ్‌ షాపింగ్‌ ఎడిషన్‌ రూ.399కి అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్‌: కేవలం ఏడాది ప్లాన్‌ మాత్రమే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,499 కాగా, ఈ నెలాఖరు వరకు రూ.990కి లభిస్తుంది. సబ్‌స్క్రిప్షన్‌ కొనుగోలు చేసిన తర్వాత రీఫండ్‌ ఆప్షన్‌ ఉండదు.

షాపింగ్‌ & డీల్స్‌
అమెజాన్‌ ప్రైమ్‌: ఫాస్ట్‌ డెలివరీపై ప్రధాన దృష్టి పెడుతుంది. ఫ్రీ వన్‌-డే, సేమ్‌-డే డెలివరీ, ప్రైమ్‌ డే ఆఫర్లు, లైటనింగ్‌ డీల్స్‌, సేల్‌ సమయంలో ప్రైమ్‌ మెంబర్లకు ముందస్తు యాక్సెస్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌: క్యాష్‌బ్యాక్‌, రివార్డ్‌లపై దృష్టి సారిస్తుంది. ప్రతి కొనుగోలుపై 5% సూపర్‌కాయిన్స్‌ క్యాష్‌బ్యాక్‌ (నెలకు గరిష్ఠంగా 800 సూపర్‌కాయిన్స్‌), బ్లాక్‌ డీల్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రీమియం ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లు, ముందస్తు యాక్సెస్‌ అందిస్తుంది. అదనంగా, క్లియర్‌ట్రిప్‌, ఫ్లిప్‌కార్ట్‌ ట్రావెల్‌ ద్వారా విమాన టికెట్‌ రద్దు లేదా రీషెడ్యూల్‌ కేవలం రూ.1కే చేసుకోవచ్చు.

వినోదం
అమెజాన్‌ ప్రైమ్‌: షాపింగ్‌ ప్రయోజనాలతో పాటు ప్రైమ్‌ వీడియో ఉచితంగా లభిస్తుంది. ఇందులో భారతీయ, అంతర్జాతీయ కంటెంట్‌, ప్రైమ్‌ మ్యూజిక్‌, ప్రైమ్‌ రీడింగ్‌ (ఇ-బుక్స్‌, మ్యాగజైన్లు), ప్రైమ్‌ గేమింగ్‌ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌: ఏడాది పాటు రూ.1,490 విలువైన యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తుంది. దీనితో యాడ్‌-ఫ్రీ యూట్యూబ్‌ వీక్షణ, బ్యాక్‌గ్రౌండ్‌ ప్లే, ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌, యూట్యూబ్‌ మ్యూజిక్‌ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."