Lunar eclipse:సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల వారికి ముప్పు..
Lunar eclipse:సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల వారికి ముప్పు.. సెప్టెంబర్ 7, 2025 ఆదివారం రాత్రి అరుదైన రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం జరగనుంది. ఈ గ్రహణం కుంభ రాశిలో, పూర్వాభద్ర నక్షత్రం కింద ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సమయంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుతాయని నమ్ముతారు.
ఈ గ్రహణం మిథున, కర్కాటక, మకర, కుంభ, మీన రాశులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. అలాగే, పూర్వాభద్ర, విశాఖ, పునర్వసు, శతభిష, ఉత్తరాభద్ర నక్షత్రాల వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం ప్రభావం సుమారు 40 రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.
రాశులపై గ్రహణ ప్రభావం:
మిథున రాశి: ఈ రాశి వారికి గ్రహణం ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఉద్యోగస్తులకు పనిలో ఇబ్బందులు, వ్యాపారస్తులకు వ్యాపారంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: చంద్రుడు ఈ రాశికి అధిపతి కావడంతో గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళనలు, ఉద్యోగంలో అడ్డంకులు తలెత్తే అవకాశం ఉంది.
మకర రాశి: అనుకోని మార్పులు, ఉద్యోగంలో ఒత్తిడి, గందరగోళ పరిస్థితులు, అధిక ఖర్చులు ఈ రాశి వారిని వేధించవచ్చు.
కుంభ రాశి: రాహువు అధిపతిగా ఉన్న ఈ రాశి వారికి ఆర్థిక నష్టాలు, పనులలో ఆలస్యం, ఆరోగ్యం మరియు కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
మీన రాశి: అనవసర ఖర్చులు, ఆఫీసులో వివాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.
ఉపశమనం కోసం చర్యలు:
రోజూ దక్షిణామూర్తి స్తోత్రం చదవడం లేదా వినడం.
చంద్రగ్రహణ రోజున చంద్రుడికి, రాహువుకి అభిషేకం చేయడం.
శివాలయంలో పూజారికి బియ్యం, మినుములు, దక్షిణ తాంబూలం దానం చేయడం.
ప్రతిరోజూ గోమాతకు తోటకూర తినిపించడం.
సోమవారం శివాలయంలో అభిషేకం చేయడం.
గ్రహణ రోజున పేదవారికి బట్టలు దానం చేయడం.
గ్రహణ సమయం:
చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7, 2025 రాత్రి 9:56 గంటలకు ప్రారంభమై, తెల్లవారుజామున 1:52 గంటలకు ముగుస్తుంది. సూతక కాలం అదే రోజు మధ్యాహ్నం 12:58 గంటల నుండి గ్రహణం ముగిసే వరకు అమలులో ఉంటుంది. ఈ సమయంలో ఖగోళ కదలికలు గణనీయమైన ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు తెలిపారు.

