DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 05 రాశి ఫలాలు.. ఈ రాశి వారు అదృష్టవంతులు..

Today Horoscope:సెప్టెంబర్ 05 రాశి ఫలాలు.. ఈ రాశి వారు అదృష్టవంతులు.. నేడు సెప్టెంబర్ 05, 2025 – శుక్రవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం. తిథి: త్రయోదశి (తెల్లవారుజామున 3:11 వరకు, తర్వాత చతుర్దశి), నక్షత్రం: శ్రవణ (రాత్రి 11:26 వరకు, తర్వాత ధనిష్ఠ), వర్జ్యం: తెల్లవారుజామున 3:31 నుండి 5:04 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8:33 నుండి 9:22 వరకు, రాహుకాలం: ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:14 వరకు.

మేషం: ఈ రోజు అనుకూలంగా సాగుతుంది. వ్యాపారంలో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకు పురోగతి కనిపిస్తుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలు తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది, మానసిక శాంతి లభిస్తుంది.

వృషభం: ఈ రోజు మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఉద్యోగాల్లో ఒత్తిడి కొంత పెరగవచ్చు. వ్యాపారంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. వాహనం కొనే ప్రయత్నాలు సఫలమవుతాయి. స్నేహితుల వల్ల వృథా ఖర్చులు ఉండవచ్చు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో మీ సలహాలకు విలువ ఉంటుంది. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మిథునం: ఈ రోజు సంతృప్తికరంగా సాగుతుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు సానుకూల ఫలితాలిస్తాయి. స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సులభంగా పూర్తికావు.

కర్కాటకం: ఈ రోజు ఉత్సాహంగా సాగుతుంది. మహిళలు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ రంగంలో వారికి ప్రయోజనం చేకూరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

సింహం: వైవాహిక జీవితం సుఖంగా సాగుతుంది. ఉదయం శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు. బంధువులతో విభేదాలు రావచ్చు, జాగ్రత్తగా వ్యవహరించండి. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. వాహనం కొనే సూచనలు కనిపిస్తున్నాయి.

కన్య: ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అధికార యోగం ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తల్లిదండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది. వ్యాపార దృష్ట్యా దూర ప్రయాణాలు ఉంటాయి. అనుకోని అతిథి రాక వల్ల సంతోషం కలుగుతుంది.

తుల: ఉద్యోగంలో ఒక మెట్టు ఎక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. మహిళలు శుభవార్తలు వింటారు. ఆస్తి కొనే అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

వృశ్చికం: ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కుటుంబంలో మీ సలహాలకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు స్థిరంగా ముందుకు సాగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

ధనుస్సు: ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగ మార్పు అవకాశం ఉంటుంది. సమాజంలో మీ ప్రాభవం పెరుగుతుంది. అన్ని రంగాల్లో పురోగతి ఉంటుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. పెట్టుబడులు ఆశించిన ఫలితాలిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కోరికలు నెరవేరుతాయి.

మకరం: ఈ రోజు ప్రశాంతంగా సాగుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది, కానీ సహోద్యోగుల నుంచి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. అనవసర ఖర్చులు, విలాసాలపై ఖర్చు ఉండవచ్చు. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

కుంభం: విదేశీ ఉద్యోగాలు లేదా చదువులకు అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బంధువులతో విభేదాలు రావచ్చు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మీనం: దూకుడు, సాహసాలు తగ్గించుకోవడం మంచిది. అధికారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. జీవిత భాగస్వామికి స్వల్ప అనారోగ్యం రావచ్చు. డ్రైవింగ్‌లో జాగ్రత్తగా ఉండండి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.

https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ