DevotionalToday Rasi Phalalu In telugu

Weekly Horoscope September 07 to 13: ఈ వారం ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..

Weekly Horoscope September 07 to 13: ఈ వారం ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. మేషం నుండి మీనం వరకు ఈ వారం (సెప్టెంబర్ 7, 2025) వార ఫలాలు. ఈ రోజు రాహు గ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం వల్ల కొన్ని రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలు, మరికొన్ని రాశులకు గ్రహబలం అనుకూలంగా లేకపోవడం వల్ల స్వల్ప ఇబ్బందులు సూచితమవుతున్నాయి. అనుకూల ఫలితాలు పొందే రాశులకు శుభవార్తలు, అనుకూలంగా లేని రాశులకు పాటించవలసిన పరిహారాలు, సూచనలు, జాగ్రత్తలను ఈ వారఫలాల్లో వివరించాము. గోచార గ్రహ స్థితుల ఆధారంగా 12 రాశులకు ఈ వారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

మేష రాశి (Aries):
ఈ వారం ప్రారంభం శుభకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల ఫలితాలు, పై అధికారుల నుండి ప్రశంసలు, ప్రమోషన్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా ఈ వారం అద్భుతమైనది. అయితే, ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వ్యవహారాల్లో అప్రమత్తత వహించండి. కేతు అనుకూలత కొంచెం తక్కువగా ఉండటం వల్ల మాటలు, ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. మంగళ, బుధవారాల్లో స్వల్ప జాగ్రత్త అవసరం.

పరిహారం:
శివ ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.
మంగళవారం హనుమంతుడికి ఆకుపూజ చేయించండి.
శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోండి.

వృషభ రాశి (Taurus):
ఈ వారం గ్రహబలం అనుకూలంగా ఉన్నప్పటికీ, చంద్రగ్రహణ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. వారం ప్రారంభం శుభకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూలతలు, విద్యార్థులకు మంచి కాలం. వ్యాపారులకు సెప్టెంబర్ 8 నుంచి గ్రహణ ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందులు, అనవసర ఖర్చులు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో సానుకూల వాతావరణం ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

పరిహారం:
వారం మొత్తం అమ్మవారి ఆరాధన చేయండి.
గ్రహణం తర్వాత బ్రాహ్మణులకు దానం చేయండి.

మిధున రాశి (Gemini):
ఈ వారం మీకు అనుకూలమైన కాలం. గ్రహబలం సానుకూలంగా ఉంది. చంద్రగ్రహణం తర్వాత ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. డబ్బుకు కొదవ ఉండదు. ఇన్వెస్ట్‌మెంట్లకు శుభకాలం. రాజకీయ నాయకులకు పదవి లభించే అవకాశం. ఉద్యోగులకు ప్రమోషన్లు, కొత్త ప్రాజెక్టులకు అనుకూలం. వారం మధ్య నుంచి శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. కీళ్ల సమస్యలు రావచ్చు, జాగ్రత్త అవసరం.

పరిహారం:
బుధవారం గణేశుడికి గరిక సమర్పించండి.
మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి.
గురువారం వెంకటేశ్వర స్వామికి తులసి సమర్పించండి.

కర్కాటక రాశి (Cancer):
వారం ప్రారంభం అంత అనుకూలంగా లేదు. చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంది. దుర్వార్త వినే అవకాశం కనిపిస్తుంది. గురువారం వరకు పనుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉంటాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. మిత్రుల వల్ల ఇబ్బందులు రావచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

పరిహారం:
గ్రహణం తర్వాత బ్రాహ్మణులకు దానం చేయండి.
సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయించండి.
శుక్రవారం అమ్మవారికి తెల్లని పూలతో అర్చన చేయించండి.

సింహ రాశి (Leo):
గ్రహబలం అనుకూలంగా ఉంది. చంద్రగ్రహణం తర్వాత మరింత శుభ ఫలితాలు కనిపిస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. ఆదివారం, బుధవారం, శనివారం చాలా అనుకూల రోజులు. ఆడంబరాలకు ఖర్చు చేసే అవకాశం. మాటకు గౌరవం పెరుగుతుంది. దూర ప్రయాణాలు లభిస్తాయి.

పరిహారం:
విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
శనివారం ఉపవాసం పాటించండి.
రోజూ వెంకటేశ్వర స్వామిని పూజించండి.

కన్యా రాశి (Virgo):
ఈ వారం గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రగ్రహణం తర్వాత మరింత శుభ ఫలితాలు. పట్టిందల్లా బంగారమవుతుంది. ఆర్థికంగా అత్యంత అనుకూల కాలం. పెట్టుబడులకు సరైన సమయం. పూర్వీకుల నుండి ఆస్తులు లభించే అవకాశం. భాగస్వామ్య వ్యాపారాలకు శుభకాలం. కోర్టు కేసుల్లో విజయం. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం.

పరిహారం:
బుధవారం పచ్చని దుస్తులు ధరించి విష్ణుమూర్తిని పూజించండి.
గణేశుడికి గరిక సమర్పించండి.

తుల రాశి (Libra):
గ్రహబలం అంత అనుకూలంగా లేదు. చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండండి, నష్టాలు రావచ్చు. నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. అనవసర ఖర్చులు నివారించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బుధవారం, శనివారం ఆర్థిక లాభాలు కనిపిస్తాయి.

పరిహారం:
దుర్గాదేవి నిత్య ఆరాధన చేయండి.
సోమవారం నీలం రంగు పుష్పాలతో శివుడికి అర్చన చేయించండి.
బిల్వపత్రాలతో శివ ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి (Scorpio):
గ్రహబలం అద్భుతంగా ఉంది. చంద్రగ్రహణం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆస్తులు కూడబెట్టే అవకాశం. కొత్త ఇళ్లు, భూములు, వాహనాలు కొనడానికి శుభకాలం. ఆర్థికంగా అనుకూల ఫలితాలు. పెట్టుబడులకు అనుకూల సమయం. గవర్నమెంట్ ఉద్యోగులకు శుభం. ప్రైవేట్ ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి.

పరిహారం:
నిత్య శివ ఆరాధన చేయండి.
శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి దర్శనం చేసుకోండి.

ధనూ రాశి (Sagittarius):
గ్రహబలం అనుకూలంగా ఉంది. చంద్రగ్రహణం తర్వాత మరింత శుభ ఫలితాలు. కొత్త పెట్టుబడులు, ఒప్పందాలకు అనుకూల కాలం. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్, వ్యాపారులకు అభివృద్ధి అవకాశాలు. డబ్బు అనుకోకుండా కలిసివస్తుంది. మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.

పరిహారం:
అమ్మవారి పూజ, లక్ష్మీ ఆరాధన చేయండి.
మూగ జీవాలకు ఆహారం అందించండి.
విష్ణు సహస్రనామాలు పఠించండి.

మకర రాశి (Capricorn):
గ్రహబలం అంత అనుకూలంగా లేదు. చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంది. అనవసర ఖర్చులు, కుటుంబ వివాదాలు రావచ్చు. వ్యాపారులకు జాగ్రత్త అవసరం. నూతన ఒప్పందాలకు అనుకూలం కాదు. ఉద్యోగులు అధికారుల ఆగ్రహాన్ని ఎదుర్కొనే అవకాశం. సోమ, మంగళవారాలు కొంచెం అనుకూలం.

పరిహారం:
శివ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
బ్రాహ్మణులకు వస్త్ర, ధన దానం చేయండి.

కుంభ రాశి (Aquarius):
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంది. ఆగ్రహ ఆవేశాలను అదుపు చేయండి. కెరీర్‌లో మార్పులు రావచ్చు. వ్యాపారులకు పాక్షిక అనుకూలం. ఖర్చులు పెరుగుతాయి. గురు, శుక్రవారాలు అనుకూలం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

పరిహారం:
శివ ఆరాధన, ఆవునేతి దీపారాధన చేయండి.
బుధవారం గణపతికి గరిక సమర్పించండి.

మీన రాశి (Pisces):
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. చంద్రగ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంది. ఆడంబర జీవనానికి దూరంగా ఉండండి. అప్పులు ఇవ్వవద్దు. మంగళ, బుధ, గురువారాలు అనుకూలం. వ్యాపారులకు అనుకోని లాభం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

పరిహారం:
విష్ణు సహస్రనామాలు పఠించండి.
బుధవారం వెంకటేశ్వర స్వామికి తులసి మాల సమర్పించండి.
శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోండి.

ఈ వారం గ్రహణ ప్రభావంతో జాగ్రత్తగా ఉండి, సూచించిన పరిహారాలు పాటించండి.