Today Horoscope:సెప్టెంబర్ 7 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ కోపం ఎక్కువ.. ఈ రాశి వారికీ లక్ష్మి కటాక్షం..
Today Horoscope:సెప్టెంబర్ 7 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ కోపం ఎక్కువ.. ఈ రాశి వారికీ లక్ష్మి కటాక్షం.. ఈ రోజుల్లో పరిస్థితిని బట్టి జాతకాలను ఎక్కువగా నమ్ముతునంరు.
మేషం (Aries):
మేష రాశి వారికి ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. అనేక ఆనందకర సంఘటనలు సంభవిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం సాధిస్తారు. వ్యాపారంలో విజయం సొంతమవుతుంది. కుటుంబ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా కలిసే కొత్త వ్యక్తులు భవిష్యత్తులో ఉపయోగపడతారు. ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇష్ట దైవ ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
వృషభం (Taurus):
వృషభ రాశి వారికి ఈ రోజు సఫల ఫలితాలనిస్తుంది. వ్యాపారులకు అనుకూల యోగాలు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణకు, కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో సౌహార్ద్రపూరిత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన శుభం కలిగిస్తుంది.
మిథునం (Gemini):
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో స్వల్ప సవాళ్లు ఎదురయ్యే అవకాశం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ శారీరక శక్తి కొంత తగ్గవచ్చు. శ్రీ సూర్య ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
సింహం (Leo):
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో అనుకోని సమస్యలు తలెత్తవచ్చు. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. కొత్త ఒప్పందాలు, ప్రాజెక్టులకు ఇది అనుకూల సమయం. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండండి. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం శుభకరం.
కన్య (Virgo):
కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలనిస్తుంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక లాభం సాధ్యం. ఇంటా బయటా సామరస్యం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఊహించని ధనలాభం, సమాజంలో గౌరవం పెరుగుతాయి. అన్ని వైపుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం శుభం కలిగిస్తుంది.

తుల (Libra):
తుల రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి. పని స్థలంలో నిరాడంబరంగా ఉండటం మంచిది. కీలక చర్చల్లో మీ ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రసన్న ఆంజనేయ స్తోత్ర పఠనం శుభకరం.
వృశ్చికం (Scorpio):
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అదృష్టవంతంగా ఉంటుంది. దైవానుగ్రహం పూర్తిగా కలిసివస్తుంది. ఏ పని చేపట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు అత్యంత అనుకూలం. బకాయిలు వసూలవుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం ఉంది. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ సందర్శనం శుభ ఫలితాలనిస్తుంది.
ధనుస్సు (Sagittarius):
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలనిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో కృషి పెరుగుతుంది. సమయపాలనతో పనులు పూర్తి చేయడం శ్రేయస్కరం. ఆర్థిక సమస్యలు తొలగాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నవగ్రహ స్తోత్ర పఠనం మేలు చేస్తుంది.
మకరం (Capricorn):
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో మీ ప్రణాళికలు అస్తవ్యస్తమవవచ్చు. ప్రియమైన వారి వల్ల మనస్తాపం కలగవచ్చు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే నష్టం తప్పుతుంది. శని ధ్యానం మంచి ఫలితాలనిస్తుంది.
కుంభం (Aquarius):
కుంభ రాశి వారికి ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. అనుకున్న పనులు సజావుగా జరగడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలు సాధ్యం. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం శుభం కలిగిస్తుంది.
మీనం (Pisces):
మీన రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలనిస్తుంది. పనుల్లో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. అస్థిర నిర్ణయాల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. ఆస్తి విషయాల్లో ప్రతికూలతలు ఎదురవవచ్చు. ప్రియమైన వారితో వివాదాలు, మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. హనుమాన్ చాలీసా పఠనం మంచి ఫలితాలనిస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

