BusinessToday gold rate

Gold rate:జేబులో ఒక్క రూపాయి ఉన్నా సరే… బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం! ఎలాగంటే?

Gold rate:జేబులో ఒక్క రూపాయి ఉన్నా సరే… బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం! ఎలాగంటే.. ప్రతి ఒక్కరికి బంగారం కొనాలనే ఆలోచన ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ధరల దృష్ట్యా బంగారం కొనటం అనేది సామాన్యునికి ఒక కల వలె ఉండిపోయింది. అలా కాకుండా ఇప్పుడు చెప్పే విధానంలో బంగారం కొనవచ్చు.

బంగారం ధరలకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దాంతో బంగారంలో పెట్టుబడి పెట్టె వారి సంఖ్య కూడా పెరుగుతుంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు 3700 డాలర్లకు చేరుకుంది. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 1.12 లక్షల రూపాయలకు చేరింది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఈ సమయంలో, దీనిలో పెట్టుబడి పెట్టడానికి సులభమైన మార్గం గురించి తెలుసుకుందాం.

గత 15 రోజులలో బంగారం ధర సుమారు 13 వేల రూపాయలు పెరిగింది, అంటే రోజుకు సగటున వెయ్యి రూపాయల చొప్పున ధర పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలోని పరిస్థితులు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో నెగెటివిటీ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత, మరియు డాలర్ విలువ పతనం వంటివి బంగారం ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక వ్యవస్థ మాన్యం వైపు సాగుతుండటం, డాలర్ విలువ తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎంచుకుంటున్నారు. దీని ఫలితంగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక సులభమైన మార్గం డిజిటల్ గోల్డ్. ప్రస్తుతం ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వంటి ఫైనాన్షియల్ టెక్నాలజీ యాప్‌లు MMTC వంటి బంగారం కంపెనీలతో కలిసి డిజిటల్ గోల్డ్ వాలెట్‌లను అందిస్తున్నాయి. ఈ యాప్‌ల ద్వారా కేవలం ఒక రూపాయి నుంచి బంగారం కొనుగోలు చేయవచ్చు. రోజువారీ బంగారం ధరల ఆధారంగా మీరు కొనుగోలు చేసిన బంగారం యూనిట్ల రూపంలో మీ వాలెట్‌లో భద్రపరచబడుతుంది.

ఉదాహరణకు, మీ వాలెట్‌లో 10 గ్రాముల బంగారం ఉంటే, మీరు దాన్ని నాణెం లేదా ఆభరణాల రూపంలో ఇంటికి డెలివరీ పొందవచ్చు, కానీ మేకింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.డిజిటల్ గోల్డ్ వాలెట్‌లో మీ బంగారం సురక్షితంగా డిజిటల్ రూపంలో నిల్వ చేయబడుతుంది. మీరు దీన్ని అమ్మడం ద్వారా లాభాలను పొందే అవకాశం కూడా ఉంటుంది.

డిస్‌క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించరాదు. బంగారం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోబడి ఉంటాయి. మీ పెట్టుబడుల వల్ల జరిగే లాభనష్టాలకు chaipakodi ఎటువంటి బాధ్యత వహించబడదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించాలని సూచిస్తున్నాము.