DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 13 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ పట్టిందల్లా బంగారమే..

Today Horoscope:సెప్టెంబర్ 13 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ పట్టిందల్లా బంగారమే.. మనలో చాలా మంది రాశి ఫలాలను చూస్కొని అడుగులు వేస్తూ ఉంటారు. అలాగే కొంత మంది అసలు జాతకాలను నమ్మరు.

13 సెప్టెంబర్ 2025 – శనివారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం
తిథి: షష్ఠి ఉదయం 7:23 వరకు, తరువాత సప్తమి తెల్లవారుజాము 5:04 వరకు
నక్షత్రం: కృత్తిక ఉదయం 10:11 వరకు, తరువాత రోహిణి
వర్జ్యం: రాత్రి 1:10 నుండి రాత్రి 2:40 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 7:44 నుండి ఉదయం 8:33 వరకు
రాహుకాలం: ఉదయం 9:08 నుండి ఉదయం 10:40 వరకు
యమగండం: మధ్యాహ్నం 1:43 నుండి మధ్యాహ్నం 3:14 వరకు
బ్రహ్మ ముహూర్తం: తెల్లవారుజాము 4:31 నుండి తెల్లవారుజాము 5:19 వరకు
అమృత ఘడియలు: ఉదయం 7:57 నుండి ఉదయం 9:26 వరకు
(గమనిక: “+” అనగా మరుసటి రోజు)

చాంద్రమానం ఆధారంగా ద్వాదశ రాశులకు ఈ రోజు ఫలితాలు:
మేషరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. కుజుడి శుభ ప్రభావం వల్ల నూతన ఉత్సాహం కలుగుతుంది. తులారాశిలో కుజుడి సంచారం మొదలవ్వడం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. ఆర్థికంగా లాభాలు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు. వ్యాపారులు, కాంట్రాక్టర్లకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అమ్మవారి ఆరాధన శుభకరం.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నెంబర్: 8

వృషభరాశి:
గ్రహబలం అనుకూలం. తలపెట్టిన పనులు సజావుగా జరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఆర్థికంగా లోటు ఉండదు. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. అయితే, మానసిక ఒత్తిడి కొంత ఎదురవవచ్చు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. శివారాధన మంచి ఫలితాలను అందిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 9

మిథునరాశి:
గ్రహబలం చాలా అనుకూలం. కుజుడి సంచార మార్పు వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. దుడుకు స్వభావాన్ని అదుపులో ఉంచుకోండి. ఆర్థికంగా ఉన్నత స్థానాలకు చేరేందుకు ప్రణాళికలకు మంచి రోజు. వ్యాపారులకు నూతన ఒప్పందాలు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అనుకూలతలను కలిగిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 6

కర్కాటకరాశి:
చంద్రబలం తక్కువగా ఉంది. అనుకోని ఇబ్బందులు తలెత్తవచ్చు. శత్రు భయం, ముఖవర్చస్సు తగ్గే అవకాశం. మాటను అదుపులో ఉంచుకోండి. నూతన వ్యాపార ఒప్పందాలకు ఈ రోజు అనుకూలం కాదు. ఖర్చులను నియంత్రించండి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. శివారాధన శుభకరం.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 9

సింహరాశి:
గ్రహబలం అనుకూలం కాదు. జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మధ్యాహ్నం నుండి పరిస్థితులు కొంత అనుకూలమవుతాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులు పనిపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు కూడా శ్రద్ధ అవసరం. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 7

కన్యారాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. పనుల్లో ఆలస్యం జరగవచ్చు. వాహన రిపేర్లకు ఖర్చు అవకాశం. వ్యాపారులకు అంత అనుకూలం కాదు. ఉద్యోగులు మాటను అదుపులో ఉంచుకోండి. అహంభావం వద్దు. అమ్మవారికి కుంకుమార్చన చేయించడం ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: బంగారు వర్ణం
లక్కీ నెంబర్: 9

తులారాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. కుజుడి శుభ ప్రభావం వల్ల పనుల్లో విజయం సాధిస్తారు. విందు-వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా లోటు ఉండదు. రియల్ ఎస్టేట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు గౌరవం పెరుగుతుంది. గణపతి ఆరాధన శుభ ఫలితాలను అందిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5

వృశ్చికరాశి:
గ్రహబలం కొంత తక్కువ. చంద్రబలం తక్కువగా ఉండటం వల్ల మాటలు చెల్లవు. వాగ్వివాదాలు ఆగండి. ఆర్థికంగా ఇబ్బందులు, అనవసర ఖర్చులు ఎదురవవచ్చు. వ్యాపారులు, వృత్తి నిపుణులు పనిపై శ్రద్ధ వహించండి. శివారాధన మంచి ఫలితాలను అందిస్తుంది.
లక్కీ కలర్: ముదురు నీలం
లక్కీ నెంబర్: 7

ధనూరాశి:
గ్రహబలం చాలా అనుకూలం. పనులు సజావుగా జరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికంగా అనుకూలం. బంధుమిత్రులతో సంతోషకరమైన సమయం. కోర్టు కేసుల్లో విజయం, పూర్వీకుల ఆస్తులు కలిసివచ్చే అవకాశం. వ్యాపారులకు శుభకాలం. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లక్ష్మీదేవి ఆరాధన శుభకరం.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 3

మకరరాశి:
గ్రహబలం అంత అనుకూలం కాదు. పనుల్లో ఆలస్యం సంభవం. వ్యాపారాలపై శ్రద్ధ అవసరం. ఖర్చులు అధికం కావచ్చు. ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. హామీలు ఇవ్వవద్దు. స్పెక్యులేషన్లు కలిసిరావు. గణపతి ఆరాధన, గరికపూజ శుభకరం.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 7

కుంభరాశి:
గ్రహబలం పాక్షికం. పనుల్లో కొంత ఇబ్బందులు కనిపిస్తాయి. వ్యాపారులు, వృత్తి నిపుణులకు ఒడిదుడుకులు. నూతన పెట్టుబడులకు అనుకూలం కాదు, కానీ భూమి క్రయవిక్రయాలకు మంచి రోజు. వాహన కొనుగోలు, బంగారం పెట్టుబడులు లాభిస్తాయి. శివారాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 7

మీనరాశి:
గ్రహబలం చాలా అనుకూలం. కుజుడి సంచార మార్పు వల్ల శుభ ఫలితాలు. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ప్రమోషన్లు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులు ధైర్యంగా చేసి విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఆనందకరమైన రోజు. అమ్మవారి ఆరాధన శుభకరం.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.