Today Horoscope:సెప్టెంబర్ 15 రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త..
Today Horoscope:సెప్టెంబర్ 15 రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 15 సెప్టెంబర్ 2025 – సోమవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – భాద్రపద మాసం – తిథి నవమి రాత్రి 1:33 వరకు, తరువాత దశమి; నక్షత్రం మృగశిర ఉదయం 7:30 వరకు, తరువాత ఆరుద్ర; వర్జ్యం మధ్యాహ్నం 3:39 నుండి సాయంత్రం 5:12 వరకు; రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:09 వరకు; బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు; అమృత ఘడియలు రాత్రి 9:04 నుండి 10:37 వరకు (నోట్: “+” అంటే మరుసటి రోజు). చాంద్రమానం ఆధారంగా మేషం నుండి మీనం వరకు ఈ రోజు దినఫలాలు ఇలా ఉన్నాయి:
మేషరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. మిత్రులతో సంతోషకరమైన సమయం గడుపుతారు. వ్యాపారాలు నీరసంగా సాగవచ్చు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం, పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. శివారాధన శుభం కలిగిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3
వృషభరాశి:
గ్రహబలం పూర్తిగా అనుకూలంగా లేదు. పనులు నిదానంగా జరిగే అవకాశం ఉంది. సోదరులతో భూసంబంధ వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి, వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. శివారాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: నీలం
లక్కీ నెంబర్: 11
మిథునరాశి:
గ్రహబలం ఎంతో అనుకూలంగా ఉంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తుల కొనుగోలుకు మంచి రోజు. భూములపై పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారులకు, ముఖ్యంగా భాగస్వామ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ధనలాభం కనిపిస్తోంది. ఉద్యోగులకు శుభకరమైన రోజు. గణపతి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: పచ్చ
లక్కీ నెంబర్: 3
కర్కాటకరాశి:
గ్రహబలం అనుకూలంగా లేదు. ఇంట్లో, బయట ఒత్తిడులు ఎదురవుతాయి. ప్రైవేట్ ఉద్యోగులకు పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహకరంగా ఉంటాయి. అమ్మవారి దర్శనం చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి. నుదుట కుంకుమ ధరించండి.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 9

సింహరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు కనిపిస్తాయి. గతంలో ఇబ్బంది పెట్టిన వివాదం నుండి బయటపడతారు. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన శుభం కలిగిస్తుంది.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నెంబర్: 6
కన్యారాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. వ్యాపారులకు మొండి బకాయిలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. నిర్ణయాలు కలిసివస్తాయి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు అనుకూలం. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు మంచి రోజు. తూర్పు దిశ ప్రయాణాలు శుభం. కనకధారా స్తోత్రం పఠించండి.
లక్కీ కలర్: బంగారు రంగు
లక్కీ నెంబర్: 9
తులారాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. అప్పుల భారం కొంచెం ఇబ్బంది పెడుతుంది. కొత్త అప్పులు చేయకండి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిషిద్ధం. ఉద్యోగులకు అధికారుల నుండి ఒత్తిడి ఉండవచ్చు. మాటలో జాగ్రత్త అవసరం. హనుమంతుడి దర్శనం మనశ్శాంతిని ఇస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 5
వృశ్చికరాశి:
గ్రహబలం కొంచెం అనుకూలత తక్కువగా ఉంది. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. సోదరులతో వివాదాలు రావచ్చు, జాగ్రత్త. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నూతన పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి, సహోద్యోగులతో చికాకులు సూచన. అమ్మవారి ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: ముదురు గంధం రంగు
లక్కీ నెంబర్: 6
ధనూరాశి:
గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. రావలసిన డబ్బు సమయానికి చేతికందుతుంది. పనుల్లో విజయం కనిపిస్తుంది. భూములపై పెట్టుబడులకు శుభకాలం. వ్యాపారులకు లాభదాయక రోజు. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3
మకరరాశి:
గ్రహబలం పాక్షికంగా అనుకూలం. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ నాయకులకు అనుకూల కాలం, పదవీ యోగం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూ క్రయవిక్రయాలు కలిసివస్తాయి. నూతన వ్యాపార ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. ముక్కంటి ఆరాధన అనుకూలతలను పెంచుతుంది.
లక్కీ కలర్: లేత వంకాయ రంగు
లక్కీ నెంబర్: 7
కుంభరాశి:
గ్రహబలం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. అనుకోని వివాదాల్లో చిక్కుకునే అవకాశం. మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కార్యాలయంలో చికాకులు కనిపిస్తాయి. శివారాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 7
మీనరాశి:
గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. తలపెట్టిన పనులు శ్రమతో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు తలెత్తవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృత్తి, ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి. చండీ ఆరాధన ఇబ్బందులను తొలగిస్తుంది.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నెంబర్: 9
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

