Business

Stock market today: సెప్టెంబర్ 15 వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్..

Stock market today: సెప్టెంబర్ 15 వ తేదీ సోమవారం స్టాక్ మార్కెట్లో ఒక లుక్ వేయాల్సిన షేర్స్.. ట్రేడర్లు ఈరోజు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. వీటిలో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను దేశీయ స్టాక్ మార్కెట్‌లు లాభాల్లో ముగించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 356 పాయింట్లు పెరిగి 81,905 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50 108 పాయింట్లు వృద్ధి చెంది 25,114 వద్ద సెషన్‌ను ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 54,809 వద్దకు చేరింది.

ఎఫ్‌ఐఐలు, డీఐఐలు
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఎఫ్‌ఐఐలు రూ. 129.58 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,556.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈ సెప్టెంబర్ నెలలో ఎఫ్‌ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 9,244.27 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 27,147.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ఇక దేశీయ స్టాక్ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 45 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు
కారణం.

“నిఫ్టీ50కి 25,150-25,200 లెవల్ కీలక రెసిస్టెన్స్‌గా మారనుంది. 25,200 పైన స్థిరపడగలిగితే, 25,500 వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి 25,700కు చేరుకోవచ్చు. 24,950-24,900 లెవల్ సపోర్ట్‌గా ఉంది,” అని ఎస్‌బీఐ సెక్యూరిటీస్‌కు చెందిన వైస్ ప్రెసిడెంట్, టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ హెడ్ సుదీప్ షా తెలిపారు.

అమెరికా స్టాక్ మార్కెట్‌లు
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను అమెరికా స్టాక్ మార్కెట్‌లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.59 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.05 శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్‌డాక్ 0.45 శాతం పెరిగింది. ఆసియా స్టాక్ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్ టు బై
బీఈఎంఎల్: బై రూ. 4,420, స్టాప్ లాస్ రూ. 4,250, టార్గెట్ రూ. 4,777
ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రాడక్ట్స్: బై రూ. 1,085, స్టాప్ లాస్ రూ. 1,050, టార్గెట్ రూ. 1,165
వేదాంత: బై రూ. 450, స్టాప్ లాస్ రూ. 440, టార్గెట్ రూ. 465
హిందుస్థాన్ జింక్: బై రూ. 463, స్టాప్ లాస్ రూ. 450, టార్గెట్ రూ. 485
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్: బై రూ. 1,550, స్టాప్ లాస్ రూ. 1,530, టార్గెట్ రూ. 1,620

బ్రేకౌట్ స్టాక్స్ టు బై
అద్వైత్ ఎనర్జీ ట్రాన్సిషన్స్: రూ. 1,880 వద్ద కొనండి, లక్ష్యం రూ. 2,020, స్టాప్ లాస్ రూ. 1,813
డేటా ప్యాటర్న్స్ (ఇండియా): రూ. 2,711 వద్ద కొనండి, లక్ష్యం రూ. 2,929, స్టాప్ లాస్ రూ. 2,600
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్: రూ. 545 వద్ద కొనండి, టార్గెట్ రూ. 585, స్టాప్ లాస్ రూ. 525
విశాల్ మెగా మార్ట్: రూ. 152 వద్ద కొనండి, టార్గెట్ రూ. 165, స్టాప్ లాస్ రూ. 146
డాక్టర్ అగర్వాల్ హెల్త్ కేర్: రూ. 433 వద్ద కొనండి, టార్గెట్ రూ. 465, స్టాప్ లాస్ రూ. 418

(గమనిక: ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. chaipakodiకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.