Amazon OffersBusinessMovies

Best Vivo Phones :వివో అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 15వేల లోపు ధరలో టాప్ 3 వివో ఫోన్లు..

Best Vivo Phones :వివో అభిమానులకు గుడ్ న్యూస్.. రూ. 15వేల లోపు ధరలో టాప్ 3 వివో ఫోన్లు.. వివో అభిమానులకు శుభవార్త! కొత్త వివో ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లు పెద్ద డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో శక్తిమంతమైన బ్యాటరీ, అద్భుతమైన కెమెరా సెటప్, గేమింగ్ కోసం పవర్‌ఫుల్ చిప్‌సెట్ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తున్నాయి.

ఈ ఫోన్‌లను ఎక్కువగా వాడినా లాగ్ లేదా హీటింగ్ సమస్యలు ఉండవు. ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో ఈ వివో స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో రూ. 15,000 బడ్జెట్‌లో టాప్ 3 బెస్ట్ వివో ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు.

వివో T4x 5G:
ఈ ఫోన్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 1050 నిట్స్ గరిష్ట ప్రకాశంతో, సూర్యకాంతిలో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రోజువారీ ఉపయోగానికి అనువైనది.

ఈ ఫోన్ IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ మరియు మిలిటరీ గ్రేడ్ డ్రాప్, షాక్ సర్టిఫికేషన్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్ శక్తిమంతమైన పనితీరును అందిస్తుంది. 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఆప్షన్‌తో ఈ ఫోన్ రూ. 13,999కి లభిస్తుంది.

వివో T3x 5G:
ఈ ఫోన్ 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ ప్రకాశంతో వస్తుంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన ఫోటో క్వాలిటీని అందిస్తుంది. 4GB, 6GB లేదా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లతో లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 1TB వరకు విస్తరించవచ్చు.

6000mAh బ్యాటరీ సాధారణ ఉపయోగంలో 2 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్ గేమింగ్‌కు అనువైన పనితీరును అందిస్తుంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 12,499కి లభిస్తుంది.

వివో Y28 5G:
ఈ ఫోన్ 6.56 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తుంది.

5000mAh బ్యాటరీ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ OS13పై రన్ అవుతుంది. మీడియాటెక్ డైమన్షిటీ 6020 ప్రాసెసర్ గేమింగ్ మరియు రోజువారీ ఉపయోగానికి అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ రూ. 12,999కి కొనుగోలు చేయవచ్చు.

గమనిక: ధరలు మరియు ఆఫర్‌లు మారవచ్చు, కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా సమాచారాన్ని చెక్ చేయండి.