Daily Horoscope:సెప్టెంబర్ 19 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ కోపం ఎక్కువ..
Daily Horoscope:సెప్టెంబర్ 19 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ కోపం ఎక్కువ.. సెప్టెంబర్ 19, 2025, శుక్రవారం, భాద్రపద మాసం, బహుళ త్రయోదశి, ఆశ్లేష నక్షత్రం.. రాశి ఫలితాలు:
మేషం:
ఉద్యోగంలో ప్రాధాన్యత, అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ఆకస్మిక లాభం. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభవార్తలు, బంధువుల నుండి డబ్బు వస్తుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు మంచి అవకాశాలు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభం:
సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా అనుకూలం. మహిళలకు ఈ రోజు శుభదాయకం. విదేశాల నుండి శుభవార్తలు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు మానండి. ఆస్తి సమస్యల నుండి ఉపశమనం. వైద్య ఖర్చులు పెరిగే అవకాశం. స్నేహితుల నుండి సహకారం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:
ఉదయం శుభవార్తలు. పెట్టుబడుల నుండి లాభాలు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికార యోగం. భాగస్వామితో కలిసి ముఖ్య పనులు పూర్తి. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారంలో ఒత్తిడి ఉన్నా లాభాలు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు అనుకూల రోజు.
కర్కాటకం:
ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు. పిల్లల చదువుల్లో పురోగతి. వైవాహిక జీవితం సుఖమయం. ప్రయాణాల్లో జాగ్రత్త. డాక్టర్లు, లాయర్లకు అనుకూలం. వివాహ ప్రయత్నాలు సఫలం. ఇతరుల విషయాల్లో జోక్యం మానండి. అనవసర ఖర్చులు రావచ్చు.
సింహం:
వ్యక్తిగత సమస్యలు పరిష్కారం. స్థిరాస్తి వివాదాలు తీరవచ్చు. వైవాహిక జీవితంలో సానుకూల మార్పులు. వ్యాపారం లాభదాయకం. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. చేపట్టిన పనులు విజయవంతం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీ సలహాలకు కుటుంబంలో ప్రశంసలు.

కన్య:
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ. కుటుంబంలో సమస్యలు రావచ్చు. ప్రేమ జీవితం అనుకూలం. ముఖ్య వ్యవహారాలు పూర్తవుతాయి. దైవ స్మరణలో ఉండండి. సాయంత్రం శుభ సంఘటన.
తుల:
అలసట, ఆర్థిక ఆందోళనలు. పనిలో బద్ధకం వల్ల ప్రతికూల ఫలితాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేయండి. ధ్యానం మానసిక ప్రశాంతత ఇస్తుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. సాయంత్రం స్నేహితులు, బంధువులతో సంతోష సమయం. వాహన యోగం.
వృశ్చికం:
వ్యాపారంలో మంచి లాభాలు. సహోద్యోగుల నుండి సహకారం. ప్రియమైన వారితో ఆనంద సమయం. ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచండి. విద్యార్థులు రాణిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో గొడవలు రావచ్చు. అనారోగ్యం ఒత్తిడి కలిగించవచ్చు. కోర్టు వ్యవహారాల్లో నిర్ణయాలు వాయిదా వేయండి.
ధనస్సు:
ఆర్థికంగా లాభం. విదేశాల నుండి శుభవార్తలు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పెట్టుబడుల నుండి లాభాలు. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. స్నేహితులతో వివాదాలు రావచ్చు, సహనం అవసరం. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ప్రేమలో ఆనందం.
మకరం:
రోజు పూర్తిగా అనుకూలం కాదు. అధిక ఖర్చులు. వ్యాపారంలో లాభాలు. పాత స్నేహితులతో సమావేశం. కొత్త పనులు ప్రారంభం. వివాహ యోగం. ఉద్యోగంలో గుర్తింపు. అనుకోని అతిథి రాకతో సంతోషం. పెండింగ్ పనులు పూర్తి. వ్యాపార ప్రయాణం. పిల్లలతో ఆనంద సమయం.
కుంభం:
మంచి పెట్టుబడులు. వ్యాయామం మొదలు పెట్టండి. కుటుంబంతో విలువైన సమయం. కోరుకున్న వస్తువు కొనుగోలు. రియల్ ఎస్టేట్‌లో లాభాలు. సమాజంలో పేరు, ప్రతిష్ఠలు. కొత్త పరిచయాలు. మహిళలు పిల్లలపై దృష్టి పెట్టాలి.
మీనం:
పెట్టుబడుల నుండి మంచి రాబడి. వ్యాపారంలో బంధువుల నుండి సమస్యలు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త. విద్యార్థులకు కష్టకాలం. వాహన కొనుగోలు యోగం. స్నేహితులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఆస్తి పత్రాల సమస్యలు తీరుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

