DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 26 రాశి ఫలాలు.. ఈ రాశులవారిపై నవగ్రహాల అనుగ్రహం.. మీ రాశి ఉందా..?

Today Horoscope:సెప్టెంబర్ 26 రాశి ఫలాలు.. ఈ రాశులవారిపై నవగ్రహాల అనుగ్రహం.. మీ రాశి ఉందా.. ఈ మధ్య కాలంలో రాశి ఫలాలను చూసుకొనే వారి సంఖ్య చాలా ఎక్కువ అయింది.

26 సెప్టెంబర్ 2025 – శుక్రవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
తిథి: చవితి ఉదయం 9:33 వరకు, తరువాత పంచమి
నక్షత్రం: విశాఖ రాత్రి 10:02 వరకు, తరువాత అనురాధ
వర్జ్యం: రాత్రి 2:39 నుండి తెల్లవారుజామున 4:27 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8:32 నుండి 9:20 వరకు, మధ్యాహ్నం 12:31 నుండి 1:18 వరకు
రాహుకాలం: ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:05 వరకు
యమగండం: మధ్యాహ్నం 3:06 నుండి సాయంత్రం 4:35 వరకు
గుళికాకాలం: ఉదయం 7:38 నుండి 9:08 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:33 నుండి 5:20 వరకు
అమృత ఘడియలు: మధ్యాహ్నం 12:09 నుండి 1:57 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:31 వరకు

మేష రాశి:
ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పనులు ఒత్తిడి లేకుండా సాఫీగా పూర్తవుతాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు ఊహించని ఆర్థిక లాభాలు సూచితం. ఉద్యోగులకు స్థాన మార్పు లేదా విభాగం మార్పు అవకాశాలు కనిపిస్తాయి. పనిపై శ్రద్ధ చూపండి, వివాదాలకు దూరంగా ఉండండి. శివపూజ మీకు శుభకరం.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: నీలం

వృషభ రాశి:
గ్రహస్థితి అత్యంత శుభకరం. వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. బంగారం, స్టాక్‌లలో పెట్టుబడులు చేయడానికి అనుకూలం. ఉద్యోగులకు కష్టం ఎక్కువైనప్పటికీ, పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: కాషాయం

మిథున రాశి:
గ్రహస్థితి అనుకూలత తక్కువగా ఉంది. పనుల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారులకు ఊహించని ఖర్చులు తప్పవు. ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టాలి. అనవసర సలహాలు, వివాదాలకు దూరంగా ఉండండి. గణపతి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: ఆకుపచ్చ

కర్కాటక రాశి:
గ్రహస్థితి పాక్షికంగా అనుకూలం. పనుల్లో ఆలస్యం కనిపిస్తుంది. వ్యాపారులకు కష్టంతో లాభాలు సూచితం. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. పూర్వీకుల ఆస్తి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది. మానసిక అస్థిరత ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి, నిరుద్యోగులకు నిరుత్సాహం కలుగుతుంది. శివారాధన శుభకరం.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: తెలుపు

సింహ రాశి:
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ మాటకు ఇంటా, బయటా విలువ పెరుగుతుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు ఉపయోగపడతాయి. వ్యాపారులకు ఉత్సాహకరమైన రోజు, ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన రోజు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఎరుపు

కన్యా రాశి:
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత కలుగుతుంది. ఆర్థికంగా శుభకరమైన రోజు. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు, సహోద్యోగుల సహకారం లభిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. అనుకోని రూపంలో అదృష్టం కలిసివస్తుంది. అమ్మవారి ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: బంగారు రంగు

తులా రాశి:
గ్రహస్థితి అనుకూలత తక్కువగా ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక అస్థిరత ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు పని ఒత్తిడి, సహోద్యోగులతో సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపారులకు రోజు మందకొడిగా ఉంటుంది. నష్టాలు రాకుండా జాగ్రత్తపడండి. గణపతికి గరిక సమర్పణ ఆటంకాలను తగ్గిస్తుంది.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: పసుపు

వృశ్చిక రాశి:
గ్రహస్థితి సామాన్యంగా ఉంది. వ్యాపారులకు కష్టంతో కొంత లాభం కనిపిస్తుంది, కానీ ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు పని ప్రదేశంలో వాగ్వివాదాలు తలెత్తే అవకాశం ఉంది, వాటికి దూరంగా ఉండండి. పెట్టుబడులకు అనుకూలత తక్కువ. నూతన వ్యాపార ప్రణాళికలను వాయిదా వేయండి. అమ్మవారికి ఎరుపు పూలతో అర్చన చేయించండి.
అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: గులాబీ

ధనూ రాశి:
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సంతానంతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ప్రియమైన వారితో సంభాషణలు మనసుకు సంతోషాన్నిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు, ఉద్యోగులకు శుభకరమైన రోజు. కొత్త సంబంధాలు బలపడతాయి. కనకధారా స్తోత్రం పఠించడం శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: గులాబీ

మకర రాశి:
గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో గందరగోళం నెలకొనవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు కనిపిస్తాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలకు దూరంగా ఉండండి. విష్ణు సహస్రనామం జపించడం శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: పసుపు

కుంభ రాశి:
శని ప్రభావం, చంద్రబలం అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు కనిపిస్తాయి. ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వ్యాపారులకు లాభదాయకమైన రోజు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, పదోన్నతులు, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. శివారాధన శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: లేత నీలం

మీన రాశి:
గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు. పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. మాటపట్టింపులకు వెళ్లకండి. వృత్తి, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. గొప్ప అవకాశం చేజారే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మానసిక ఆందోళన కనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠనం శుభ ఫలితాలనిస్తుంది.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: కాషాయం

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.