Today Horoscope:సెప్టెంబర్ 27 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అనుకొనే అదృష్టం..
Today Horoscope:సెప్టెంబర్ 27 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ అనుకొనే అదృష్టం.. ఈ ఆమధ్య కాలంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే జాతకాలను చూసుకుంటున్నారు. దానిలో బాగంగా ప్రతి రోజు జాతక ఫలాలను చూసుకొనే వారి సంఖ్య కూడా చలా ఎక్కువగానే ఉంది.
27 సెప్టెంబర్ 2025 – శనివారం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
తిథి: పంచమి మ. 12:03 వరకు, తర్వాత షష్ఠి
నక్షత్రం: అనురాధ రా. 1:00+ వరకు, తర్వాత జ్యేష్ఠ
వర్జ్యం: ఉ. 7:44 నుండి ఉ. 8:32 వరకు
దుర్ముహూర్తం: ఉ. 7:44 నుండి ఉ. 8:32 వరకు
రాహుకాలం: ఉ. 9:08 నుండి ఉ. 10:37 వరకు
యమగండం: మ. 1:38 నుండి మ. 3:03 వరకు
గుళికాకాలం: ఉ. 6:10 నుండి ఉ. 7:38 వరకు
బ్రహ్మముహూర్తం: తె. 4:34 నుండి తె. 5:21 వరకు
అమృత ఘడియలు: మ. 1:26 నుండి మ. 3:13 వరకు
(నోట్: “+” అంటే మరుసటి రోజు)
చాంద్రమానాన్ని అనుసరించి, ద్వాదశ రాశులకు ఈ రోజు దినఫలాలు ఇలా ఉన్నాయి. మేషం నుండి మీనం వరకు తెలుసుకోండి…
మేషరాశి:
ఈ రోజు గ్రహాలు పూర్తిగా అనుకూలంగా లేవు. అనవసరమైన వాదనల్లో పడకండి. ఉద్యోగులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు సులభంగా దొరకవు. ఆర్థికంగా కొంచెం ఆడంబరాలు ఎదురవుతాయి. వ్యాపారులకు వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. శివుడి పూజ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: తెలుపు
వృషభరాశి:
గ్రహాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఆస్తి వ్యవహారాలు మంచిగా సాగుతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలకు ఇది శుభ రోజు. వృత్తి, వ్యాపారంలో ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. అనుకోకుండా ధనం వస్తుంది. జీవితసహచారి సూచనలు మీకు సహాయపడతాయి. హనుమాన్ చాలీసా పఠించండి, శుభాలు పెరుగుతాయి.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: లేత బంగారు రంగు

మిథునరాశి:
గ్రహాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. మీ మాటలు ఎవరూ తిరస్కరించవు. సమయానికి డబ్బు చేతిలోకి వస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మంచి పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దొరుకుతాయి. స్నేహితులు, బంధువుల సహాయం లభిస్తుంది. గణపతి పూజ చేయండి, అనుకూలతలు మెరుగుపడతాయి.
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట రంగు: గులాబీ
కర్కాటకరాశి:
గ్రహాలు కొంత అనుకూలంగా, కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారంలో కష్టపడితే లాభాలు వస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. త్వరగా తీర్మానాలు తీసుకోకండి. ఉద్యోగులు ఆఫీస్ రాజకీయాల్లో పడకండి. సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఒక వార్త ఆందోళన కలిగించవచ్చు. హనుమాన్ చాలీసా పఠించండి, మంచి ఫలితాలు వస్తాయి.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: కాషాయం
సింహరాశి:
గ్రహాలు కొంత అనుకూలంగా, కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకోని ఖర్చు వల్ల అప్పులు పడవచ్చు. వృత్తి, ఉద్యోగంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగులకు అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఖర్చులు నియంత్రించండి. శివుడి పూజ చేయండి, అనుకూలతలు పెరుగుతాయి.
అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: నీలం
కన్యారాశి:
గ్రహాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. మీ మాటలకు విలువ పెరిగి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా ధనలాభాలు వస్తాయి. వ్యాపారులకు ఇది శుభకాలం. కొత్త పెట్టుబడులకు అనుకూలం. పాత సమస్యల నుండి బయటపడతారు. అమ్మవారి పూజ చేయండి, శుభాలు పొందండి.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: గోల్డ్ కలర్
తులారాశి:
గ్రహాలు కొంత అనుకూలంగా, కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో విలువైన వస్తువులు రక్షించండి. అపరిచితులను నమ్మకండి. ఇంట్లో కొంచెం అశాంతి ఉండవచ్చు. వెంకటేశ్వరస్వామి దర్శనం చేయండి, మంచి జరుగుతుంది.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: పసుపు
వృశ్చికరాశి:
గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. అనుకోని మార్గాల్లో ఆదాయాలు వస్తాయి. చుట్టూ అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయం పూర్తిగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నా, మంచి గుర్తింపు వస్తుంది. మీ సామర్థ్యం ప్రదర్శనకు ఇది మంచి రోజు. అమ్మవారికి కుంకుమపూజ చేయించి, 116 రూపాయలు ఎర్ర గుడ్డలో ముడి కట్టి హుండీలో పెట్టండి. మనసు కోరికలు నెరవేరతాయి.
అదృష్ట సంఖ్య: 11
అదృష్ట రంగు: ముదురు ఎరుపు
ధనురాశి:
గ్రహాలు పూర్తిగా అనుకూలంగా లేవు. వృత్తి, వ్యాపారంలో నిరుత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టండి. మాటలు అదుపులో ఉంచండి. వివాదాల్లో పడకండి. వాహనాల ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. గణపతికి గరిక సమర్పించండి. 9 సార్లు మహామృత్యుంజయ మంత్రం జపించి రోజు ప్రారంభించండి. ఇబ్బందులు తొలగుతాయి.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: పసుపు
మకరరాశి:
గ్రహాలు అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి. ప్రయత్నం లేకుండానే ధనం వస్తుంది. పెద్ద వాహనాల కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. బంగారం పెట్టుబడులకు మంచి రోజు. వృత్తి, వ్యాపారం మెరుగుపడుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. శివుడికి ఆవుపాల అభిషేకం చేయించండి, గొప్ప ఫలితాలు వస్తాయి.
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: ముదురు నీలం
కుంభరాశి:
గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. విదేశీయ ఉద్యోగాలు చూస్తున్నవారు మంచి వార్తలు వింటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూమి కొనుగోలు-విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారులకు అద్భుత ఫలితాలు వస్తాయి. అనుకోని ధనలాభాలు ఉన్నాయి. మీలో కొత్త ఉత్సాహం, ముఖ వెలుగు పెరుగుతాయి. శివుడి పూజ చేయండి, శుభాలు పొందండి.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: తెలుపు
మీనరాశి:
గ్రహాలు పూర్తిగా అనుకూలంగా లేవు. వ్యాపారులకు రోజు కష్టంగా సాగుతుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు నియంత్రించండి. ప్రైవేట్ ఉద్యోగులు అనవసర సంభాషణల్లో పడకండి. సహోద్యోగులతో ఇబ్బందులు రావచ్చు. సోదరులతో వివాదాలు జాగ్రత్త. అమ్మవారి దర్శనం చేయండి, మంచి జరుగుతుంది.
అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: నలుపు
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

