Business

Tatkal booking:తత్కాల్ టికెట్ ప్రతిసారీ మిస్ అవుతోందా? ఈసారి ఈ ట్రిక్స్ పాటించి చూడండి!

Tatkal booking:తత్కాల్ టికెట్ ప్రతిసారీ మిస్ అవుతోందా? ఈసారి ఈ ట్రిక్స్ పాటించి చూడండి..ట్రైన్ టికెట్ దొరకనప్పుడు చాలామంది తత్కాల్ బుకింగ్‌లో ట్రై చేస్తుంటారు. కానీ, ఒకేసారి ఎక్కువ మంది ప్రయత్నించడంతో టికెట్లు బుక్ చేసేలోపే అయిపోతాయి. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించడం ద్వారా తత్కాల్ టికెట్ సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తత్కాల్ బుకింగ్ సమయం
తత్కాల్ బుకింగ్ విండో తెరిచిన కొద్ది సెకన్లలోనే సీట్లు అయిపోతాయి. పేమెంట్ చేసేలోపే టికెట్లు సోల్డ్ అవుట్ అవుతుంటాయి. అయితే, కొన్ని టెక్నిక్‌లతో సులభంగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అవేంటంటే…

1. ఐఆర్‌సీటీసీ ఖాతా సిద్ధంగా ఉంచండి
తత్కాల్ బుకింగ్ కోసం ముందుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఖాతా సృష్టించండి. ప్రయాణీకుల వివరాలు, ఇతర సమాచారాన్ని ముందే నింపి ఉంచండి. టికెట్ మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ వాలెట్‌లో జమ చేసి సిద్ధంగా ఉంచుకోండి. బుకింగ్ సమయానికి 10 నిమిషాల ముందే లాగిన్ అయి, ట్రైన్ నంబర్‌తో సెర్చ్ చేస్తూ ఉండండి. బుకింగ్ విండో తెరిచిన వెంటనే వేగంగా బుక్ చేయండి. ముందుగా వివరాలు నింపి ఉంటే, సెకన్లలో పేమెంట్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

2. స్పెషల్ కోటాను ఉపయోగించుకోండి
మీరు సీనియర్ సిటిజన్ లేదా మహిళల కోటాకు అర్హులైతే, ఆ ఎంపికను సెలెక్ట్ చేయండి. ఈ కోటాలో టికెట్లు ప్రత్యేకంగా కేటాయించబడతాయి కాబట్టి, జనరల్ కోటాతో పోలిస్తే పోటీ తక్కువ ఉంటుంది. దీనివల్ల టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం పెరుగుతుంది.

3. బహుళ బుకింగ్ ప్రయత్నాలు
టికెట్ ఎలాగైనా కావాలనుకుంటే, ఇద్దరు వ్యక్తులు ఒకేసారి రెండు డివైస్‌ల నుంచి బుకింగ్ ప్రయత్నించండి. ఫోన్ ప్రాసెసర్ వేగం, ఇంటర్నెట్ స్పీడ్‌ను బట్టి బుకింగ్ ఛాన్స్ పెరుగుతుంది. రెండు ఐఆర్‌సీటీసీ ఖాతాల ద్వారా ట్రై చేస్తే, కన్ఫర్మేషన్ అవకాశం కొంత ఎక్కువగా ఉంటుంది.

4. ఇతర చిట్కాలు
సరైన ట్రైన్ ఎంచుకోండి: ఆ రూట్‌లో వెళ్లే అన్ని ట్రైన్‌ల గురించి తెలుసుకుని, తక్కువ స్టేషన్లు, తక్కువ దూరం ప్రయాణించే ట్రైన్‌ను ఎంచుకోండి. ఎక్కువ స్టేషన్లు లేదా ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్‌లకు పోటీ ఎక్కువగా ఉంటుంది.
వీక్‌డేస్‌లో ప్రయాణించండి: వీకెండ్‌లకు బదులు వీక్‌డేస్‌లో జర్నీ ప్లాన్ చేస్తే టికెట్ బుక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ ట్రిక్స్ పాటిస్తే తత్కాల్ టికెట్ సులభంగా బుక్ చేసుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. ఇప్పుడు ట్రై చేసి చూడండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.