DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:సెప్టెంబర్ 30 రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్త..

Today Horoscope:సెప్టెంబర్ 30 రాశి ఫలాలు.. ఈ రాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్త.. ఈ మధ్య కాలంలో ఏదైనా సమస్య వస్తే అందరూ జాతకాలు వైపు అడుగులు వేస్తున్నారు. అయితే కొంత మంది జాతకాలను అసలు నమ్మరు.

30 సెప్టెంబర్ 2025 – మంగళవారం, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
తిథి: అష్టమి సాయంత్రం 6:01 వరకు, తర్వాత నవమి
నక్షత్రం: మూల ఉదయం 6:09 వరకు, తర్వాత పూర్వాషాఢ
వర్జ్యం: సాయంత్రం 4:36 నుండి 6:19 వరకు
దుర్ముహూర్తం: రాత్రి 10:54 నుండి 11:41 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3:05 నుండి సాయంత్రం 4:33 వరకు
యమగండం: ఉదయం 9:07 నుండి 10:36 వరకు
గుళికాకాలం: మధ్యాహ్నం 12:06 నుండి 1:35 వరకు
బ్రహ్మముహూర్తం: తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు
అమృత ఘడియలు: రాత్రి 2:55 నుండి తెల్లవారుజామున 4:38 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:29 వరకు
(నోట్: “+” అనగా మరుసటి రోజు)
ద్వాదశ రాశుల రాశిఫలాలు:

మేషరాశి:
ఈ రోజు గ్రహబలం అనుకూలత తక్కువగా ఉంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వ్యాపారులు కీలక పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. నిరుద్యోగులకు కొత్త అవకాశం కనిపిస్తుంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి. గణపతి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ
లక్కీ నెంబర్: 3

వృషభరాశి:
గ్రహబలం మిశ్రమంగా ఉంది. ఇంటి వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలకు దూరంగా ఉండండి. నిదానంగా వ్యవహరించడం ఈ రోజు మంచిది. పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, ఖర్చులపై నియంత్రణ అవసరం. వ్యాపారులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠనం రోజు ప్రారంభంలో చేయడం ఇబ్బందులను తగ్గిస్తుంది.
లక్కీ కలర్: బంగారు రంగు
లక్కీ నెంబర్: 3

మిథునరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. బుధుడి అనుగ్రహంతో వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. మీ మాటకు విలువ కొంత తగ్గవచ్చు, కాబట్టి అనవసర సలహాలు ఇవ్వకండి. వ్యాపారస్తులు టాక్స్, ఇతర విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు రోజు చాలా అనుకూలం. శివాలయంలో ఆవునేతి దీపం వెలిగించడం శుభఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 7

కర్కాటకరాశి:
గ్రహబలం సానుకూలంగా ఉంది. పాత బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఉంటుంది. సమాజంలో మీకు గుర్తింపు, మాటకు విలువ పెరుగుతాయి. వ్యాపారులకు ధనలాభాలు ఉన్నాయి. వృద్ధికి అవకాశాలు కనిపిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులకు బోనస్‌లు రావచ్చు. అమ్మవారికి అర్చన చేయించడం శుభాలను పెంచుతుంది.
లక్కీ కలర్: కనకాంబరం రంగు
లక్కీ నెంబర్: 6

సింహరాశి:
గ్రహబలం అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు ఫలించవు, పెద్దల సలహాలు తీసుకోండి. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు క్రయవిక్రయాలు, ఒప్పందాలు కలిసివస్తాయి. అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం మంచి ఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 3

కన్యారాశి:
గ్రహబలం మిశ్రమంగా ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. హామీలు, సంతకాలు చేయడం మానుకోండి. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్‌లకు దూరంగా ఉండండి. సాహసోపేతమైన పనులు చేపట్టవద్దు. ప్రైవేట్ ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. ఎరుపు పూలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం ఇబ్బందులను తగ్గిస్తుంది.
లక్కీ కలర్: మెరూన్
లక్కీ నెంబర్: 5

తులారాశి:
గ్రహబలం సామాన్యంగా ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. మీ మాటకు విలువ తగ్గవచ్చు. వాగ్వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారులకు రోజు మందకొడిగా సాగుతుంది. ఉద్యోగులకు, వృత్తి నిపుణులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకోండి లేదా ఇంట్లో ప్రార్థన చేయండి, సమస్యలు తగ్గుతాయి.
లక్కీ కలర్: లేత ఎరుపు
లక్కీ నెంబర్: 7

వృశ్చికరాశి:
గ్రహబలం మిశ్రమంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, కానీ ఆదాయం కూడా బాగుంటుంది. ఆరోగ్యం, ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు ఫలిస్తాయి. శివారాధన శుభఫలితాలనిస్తుంది. రాత్రి 11 గంటల తర్వాత శుభవార్త వినిపించే అవకాశం ఉంది.
లక్కీ కలర్: లేత నీలం
లక్కీ నెంబర్: 6

ధనూరాశి:
గ్రహబలం అద్భుతంగా ఉంది. అనుకోని ధనలాభాలు కనిపిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులు, టీచింగ్ వృత్తిలో ఉన్నవారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి. పిల్లల పురోగతి ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలు, వ్యాపారాలు కలిసివస్తాయి. అమ్మవారి ఆరాధన శుభఫలితాలను పెంచుతుంది.
లక్కీ కలర్: బంగారు వర్ణం, నీలం
లక్కీ నెంబర్: 5

మకరరాశి:
గ్రహబలం సామాన్యంగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగులకు పై అధికారులతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా సర్దుబాటు అయినప్పటికీ, ఖర్చులు అదుపు తప్పవచ్చు. కొత్త ఋణాలు చేయవద్దు. దూర ప్రయాణాలు వాయిదా వేయండి. పంచముఖి ఆంజనేయస్వామి దర్శనం ఇబ్బందులను తగ్గిస్తుంది.
లక్కీ కలర్: కాషాయం
లక్కీ నెంబర్: 6

కుంభరాశి:
గ్రహబలం అనుకూలంగా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తగ్గుతాయి. రోజు ఉల్లాసంగా సాగుతుంది. ఊహించని ధనలాభాలు ఉన్నాయి. ఉద్యోగులకు ఆఫీసులో ఆశ్చర్యకర మార్పులు మంచి ఫలితాలనిస్తాయి. శివారాధన అనుకూలతలను పెంచుతుంది.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నెంబర్: 3

మీనరాశి:
గ్రహబలం తక్కువగా ఉన్నప్పటికీ, పనులు అనుకూలంగా జరుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించండి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా అనుకూల సమయం. కనకధారా స్తోత్రం పఠనం శుభఫలితాలనిస్తుంది.
లక్కీ కలర్: గంధం రంగు
లక్కీ నెంబర్: 9

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.