Horoscope Today:సెప్టెంబర్ 2 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ శత్రువులు ఎక్కువ.. కాస్త జాగ్రత్త..
Horoscope Today:సెప్టెంబర్ 2 రాశి ఫలాలు.. ఈ రాశి వారికీ శత్రువులు ఎక్కువ.. కాస్త జాగ్రత్త.. ఈ రోజుల్లో రాశి ఫలాలను చూసుకొనే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. అలాగే నమ్మని వారు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1):
వృత్తి, ఉద్యోగ రంగాల్లో పనులు సాఫీగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్ల వృత్తుల వారికి కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధు, మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు, పెండింగ్ వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటా, బయటా కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఆదాయం బాగున్నప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ఆఫర్ అందుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2):
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగలిగే స్థాయిలో ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై ఆధారపడకపోవడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ లావాదేవీలు ఆశించిన లాభాలను అందిస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి వచ్చి ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3):
అనుకోని ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఉద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్ల వృత్తుల వారు బిజీగా ఉంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష):
ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల దిశగా పురోగమిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించి శుభ పరిణామాలు జరుగుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు. ప్రయాణాలు ఫలవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. మిత్రుల నుండి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1):
ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహిస్తారు. బంధువులకు స్తోమతకు మించి ఆర్థిక సహాయం చేస్తారు. మిత్రులతో కొంత అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రుణ సమస్యలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు విస్తరిస్తాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2):
అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆదాయం వివిధ మార్గాల్లో పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3):
వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం సాధ్యమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లల చదువులపై శ్రద్ధ పెరుగుతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట):
ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకర పరిణామం జరుగుతుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. అవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. సొంత నిర్ణయాలు లాభిస్తాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆకస్మిక ధనలాభం సాధ్యమవుతుంది. మొండి బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1):
ఉద్యోగంలో పదోన్నతి, జీత భత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. ఇంటా, బయటా గౌరవం పెరుగుతుంది. వృత్తి జీవితం అనుకూలంగా సాగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు ఎక్కువగా పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2):
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల, సంతృప్తికర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాలపై శ్రద్ధ పెంచడం మంచిది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో సమస్యలు, అపార్థాలు రావచ్చు. ఎవరికీ హామీలు లేదా వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3):
ఉద్యోగ జీవితంలో అనుకోని శుభ పరిణామాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కార్యసిద్ధి, వ్యవహార జయం సాధ్యమవుతుంది. డాక్టర్లు, లాయర్ల వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి):
వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు పలుకుబడిని పెంచుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక నష్టం రావచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

