Business

Business Idea:ఇంట్లో ఒక గదిలో చేసే బిజినెస్‌తో తక్కువ పెట్టుబడితో నెలకు లక్షల్లో ఆదాయం!

Business Idea:ఇంట్లో ఒక గదిలో చేసే బిజినెస్‌తో తక్కువ పెట్టుబడితో నెలకు లక్షల్లో ఆదాయం! ఒక్క దెబ్బతో జీవితం సెట్‌..కుంకుమ పువ్వు సాగుతో లక్షల రూపాయల ఆదాయం సంపాదించడం సులభం. ఏరోపోనిక్స్‌ పద్ధతిలో తక్కువ స్థలంలో, తక్కువ శ్రమతో ఇంట్లోనే కుంకు పువ్వును పండించవచ్చు. కిలోకు రూ.5 లక్షల వరకు ధర పలికే ఈ ‘ఎర్రబంగారం’కు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది.

వందలో తొంభై మందికి జీవితంలో ఒక్కసారైనా బిజినెస్‌ చేయాలనే ఆలోచన వస్తుంది. చాలా మందికి ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనే కోరిక ఉంటుంది. కానీ, ఏ బిజినెస్‌ చేయాలి? ఎలా మొదలుపెట్టాలి? ఎంత పెట్టుబడి అవసరం? ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఉత్పత్తి ఏది? అనే విషయాలపై స్పష్టత ఉండదు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే, చాలా మంది వెంటనే బిజినెస్‌ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన బిజినెస్‌ ఐడియాను ఇప్పుడు తెలుసుకుందాం.

కుంకుమ పువ్వు సాగు
కుంకుమ పువ్వు అంటే వెంటనే కశ్మీర్‌ గుర్తొస్తుంది. కానీ, ఇప్పుడు ఈ పుష్పాన్ని ఎక్కడైనా పండించవచ్చు. దీని మార్కెట్‌ ధర కిలోకు రూ.5 లక్షల వరకు ఉంటుంది, అంతర్జాతీయ మార్కెట్‌లో అయితే రూ.15 లక్షల వరకు ఉంది. తక్కువ శ్రమతో, కొంత పెట్టుబడితో, రోజుకు కొంత సమయం కేటాయిస్తే లక్షల్లో సంపాదించే అవకాశం ఈ బిజినెస్‌లో ఉంది. అంతేకాదు, దీనికి పెద్ద భూములు కూడా అవసరం లేదు. కేవలం 400 చదరపు అడుగుల గది ఉంటే చాలు, వ్యాపారం మొదలుపెట్టొచ్చు.

కుంకుమ పువ్వుకు స్వీట్స్‌ తయారీ, కాస్మెటిక్స్‌ ఉత్పత్తి, ఔషధాలు వంటి అనేక రంగాల్లో భారీ డిమాండ్‌ ఉంది. గర్భిణీ స్త్రీలు పాలలో కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని కూడా చెబుతారు. ఈ ‘ఎర్రబంగారం’కు ఉన్న డిమాండ్‌ కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది దీన్ని సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. చల్లని వాతావరణంలో పెరిగే ఈ పంటను ఇంట్లో ఒక గదిలో ఎలా సాగు చేయాలి? అనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం ‘ఏరోపోనిక్స్‌’ సాగు పద్ధతి.

ఏరోపోనిక్స్‌ అంటే ఏమిటి?
ఏరోపోనిక్స్‌ పద్ధతిని 1970లలో అమెరికా శాస్త్రవేత్త డాక్టర్‌ టెడ్‌ గెరిక్‌ NASA కోసం అభివృద్ధి చేశారు. అంతరిక్షంలో స్పేస్‌ స్టేషన్లలో సాగు కోసం ఈ సాంకేతికతను రూపొందించారు. తర్వాత దీన్ని భూమిపై వ్యవసాయంలో ఉపయోగించడం మొదలైంది. ఈ పద్ధతి ప్రత్యేకత ఏమిటంటే, తక్కువ స్థలం, తక్కువ నీరు, మట్టి అవసరం లేకపోవడం.

ఎలా మొదలుపెట్టాలి?
ఈ బిజినెస్‌ కోసం ఒక గది అవసరం. ఈ గదిని చల్లగా ఉంచేందుకు ఎయిర్‌ కండిషనర్‌ అవసరం. అలాగే, ఐరన్‌ రాక్‌లు కావాలి. ఈ రాక్‌లు 6 అడుగుల ఎత్తులో, ఒక్కో రాక్‌లో 5 అరలుగా ఉండేలా ఏర్పాటు చేయాలి. ఈ అరలలో ప్లాస్టిక్‌ తొట్టెలు అమర్చుకోవడానికి అనువుగా ఉండాలి. గాలిలో తేమను నియంత్రించడానికి హ్యూమిడిఫైయర్‌ కూడా అవసరం. ఇంతే, ఇతర పెద్ద యంత్రాలు అవసరం లేదు.

విత్తనాల కోసం కశ్మీర్‌కు వెళ్లి నేరుగా తెచ్చుకోవడం ఉత్తమం. కిలో విత్తనాలు రూ.800కి లభిస్తాయి. ఈ విత్తనాలను ‘బల్బులు’ అంటారు, ఇవి వెల్లుల్లి పాయల్లా కనిపిస్తాయి. జూలై చివరిలో లేదా ఆగస్టు మొదటి వారంలో సాగు మొదలుపెట్టవచ్చు. 7 గ్రాముల బరువున్న విత్తనాలు సాగుకు బాగా పనికొస్తాయి. చిన్న సైజు విత్తనాలను వేరే ట్రేలో పెట్టి, తదుపరి సంవత్సరం కోసం పెంచుకోవచ్చు.

ఖర్చు
చిల్లర ఖర్చులతో కలిపి రూ.1.5 లక్షల వరకు అవుతుంది. హ్యూమిడిఫైయర్‌కు రూ.60,000, రాక్‌ల కోసం రూ.1 లక్ష, LED గ్రో లైట్స్‌కు రూ.60,000 వరకు ఖర్చు అవుతుంది. చల్లని వాతావరణం కోసం XLPE షీట్‌తో రూమ్‌ను ప్రూఫింగ్‌ చేయాలి, ఇది మీటర్‌కు రూ.75 ఖర్చవుతుంది. విత్తనాల కోసం రూ.2-3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. మొత్తంగా, రూ.6 లక్షలతో ఈ సాగును ప్రారంభించవచ్చు.

మార్కెటింగ్‌
పంట సిద్ధమైన తర్వాత, ఆన్‌లైన్‌లో హోల్‌సేల్‌ వ్యాపారులను సంప్రదించి అమ్మవచ్చు. లేదా సొంత బ్రాండ్‌ స్థాపించి ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. ఎగుమతి అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ దీనికి అవసరమైన రిజిస్ట్రేషన్లు పొందాలి. భారత మార్కెట్‌లో కిలోకు రూ.5 లక్షల వరకు ధర ఉంది. తొలి సంవత్సరంలో తక్కువ దిగుబడి వచ్చినా, రెండో సంవత్సరం నుండి అవగాహనతో దిగుబడి పెరుగుతుంది. ఒక చిన్న గదిలో 5 కిలోల దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.