BSNL Recharge: ఒక్క రూపాయికే నెల రోజుల రీఛార్జ్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్..!
BSNL Recharge: ఒక్క రూపాయికే నెల రోజుల రీఛార్జ్.. బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్.. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఇటీవలి కాలంలో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తోంది. 4జీ సేవల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో, మరింత ఆసక్తికరమైన ప్లాన్లను అందిస్తోంది. తాజాగా, కేవలం ఒక్క రూపాయి రీచార్జ్‌తో 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
దీపావళి సందర్భంగా, బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. కేవలం రూ.1కే నెల రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్‌ను ప్రకటించి, దీపావళి బహుమతిగా అందజేసింది. ‘బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా’ (BSNL Diwali Bonanza Offer) పేరిట ఈ ప్లాన్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది.
దీపావళి బొనాంజా వివరాలు
ఈ కొత్త ప్లాన్ ద్వారా కేవలం ఒక్క రూపాయికి 30 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్లు, రోజుకు 2జీబీ డేటా కూడా లభిస్తాయి. అయితే, ఈ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను కొత్తగా తీసుకోవాలనుకునే వారు ఉచిత సిమ్‌ను పొందవచ్చు. దీని కోసం సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించవచ్చు లేదా రిటైలర్లను సంప్రదించవచ్చు.
తక్కువ ధరలతో ఆకర్షణ
జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచుతుండగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం ధరలను తగ్గించి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. త్వరలో 5జీ నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించనున్నట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. 5జీ సేవల్లోకి బీఎస్ఎన్ఎల్ అడుగుపెడితే, టెలికాం మార్కెట్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

