Devotional

TTD online quota tickets :శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఈ రోజే జనవరి 2026 దర్శన కోటా విడుదల..

TTD online quota tickets :శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం.. ఈ రోజే జనవరి 2026 దర్శన కోటా విడుదల.. పూర్తి వివరాలు.. తిరుమల కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి హిందువు ఆశిస్తాడు. అందుకే భక్తులు తమ సౌకర్యం ప్రకారం శ్రీవారిని దర్శించి, మొక్కులు తీర్చుకుంటారు.

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌలభ్యం కోసం ముందస్తు దర్శన టికెట్లు, గదుల బుకింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. కొత్త సంవత్సరంలో శ్రీవారిని దర్శించాలనుకునే భక్తుల కోసం జనవరి 2026 దర్శన కోటాను ఈ రోజు (అక్టోబర్ 19, 2025) విడుదల చేయనుంది.

జనవరి 2026 దర్శనం & గదుల కోటా వివరాలు:
ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు (అక్టోబర్ 19):
జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

ఈ టికెట్ల కోసం అక్టోబర్ 21 ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవచ్చు.
లక్కీ డిప్‌లో ఎంపికైన వారు అక్టోబర్ 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపు పూర్తి చేస్తే టికెట్లు మంజూరవుతాయి.

ఆర్జిత సేవా టికెట్ల విడుదల (అక్టోబర్ 23):
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

వర్చువల్ సేవల కోటా (అక్టోబర్ 23):
వర్చువల్ సేవలు, దర్శన స్లాట్‌ల కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు (అక్టోబర్ 24):
శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా (అక్టోబర్ 24):
వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఈ సేవలు, దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://ttdevasthanams.ap.gov.in ను సందర్శించాలని కోరుతోంది.