Karthikamasam 2025: మొదటి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి.. దీపారాధాన చేసి ధానాలు చేస్తే..
Karthikamasam 2025: మొదటి కార్తీక సోమవారం ఉపవాసం ఉండి.. దీపారాధాన చేసి ధానాలు చేస్తే.. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది మరియు విశిష్టమైనది. ఈ మాసంలో నిత్యం శివుడిని ఆరాధిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు పరమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.
ఈ సంవత్సరం (2025) మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ 27న వస్తోంది. ఆ రోజున ఉపవాసం ఉండి, దీపారాధన చేసి, దానం చేసిన వారికి కోటి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శివుడిని ఎలా పూజించాలో ఈ వివరణలో తెలుసుకుందాం.
కార్తీక మాసంలో సోమవారం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. 2025 సంవత్సరంలో కార్తీక మాసం మొదటి సోమవారం అక్టోబర్ 27న వస్తోంది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ రోజున చేసే పూజలు అత్యంత ఫలవంతమని పండితులు అంటున్నారు. శివాలయ దర్శనం, అభిషేకం, ఉపవాసం లేదా ఏకభుక్తం వంటివి భక్తులు తమ శక్తి మేరకు ఆచరించడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున స్నానం, పూజ, జపం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం లభిస్తుందని వారు చెబుతున్నారు.
హిందూ సంప్రదాయంలో ఆధ్యాత్మికతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, పూజ, దానం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. “శివ శివ” అంటూ నామస్మరణ చేయడం, “కార్తీక దామోదర” అని కీర్తించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో పూర్ణుడై ఉంటాడు కాబట్టి, పరమేశ్వరుని ఆరాధించడం ద్వారా అతని అనుగ్రహం పొందవచ్చు.
కార్తీక సోమవారం (అక్టోబర్ 27, 2025) నాడు దీపారాధన, ఆకాశ దీప దర్శనం, దానం, ధర్మం వంటివి రెట్టింపు ఫలితాలను ఇస్తాయని పండితులు అంటున్నారు. ఈ మాసం రోజులలో, ముఖ్యంగా సోమవారం నాడు ఉపవాసం ఉండి, అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. కొందరు సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత శివపూజ చేసి, ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమిస్తారు. ఆ రోజున ఉపవాసం, దీపారాధన, దానం చేసిన వారికి కోటి యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
కార్తీక సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయాలి. సాయంత్రం ప్రదోష కాలంలో ఇంటిలోని పూజా గదిలో దీపారాధన చేసి, నక్షత్ర దర్శనం తర్వాత శివాలయానికి వెళ్లి పరమేశ్వరుడిని దర్శించుకోవాలి. దేవాలయంలో దీపారాధన చేసి, “ఓం నమః శివాయ” పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి. ఇలా చేయడం వల్ల కోటి సోమవారాలు ఆచరించిన పుణ్యఫలం లభిస్తుంది.
కార్తీక మాసంలో భక్తులు నిత్యం భోళాశంకరుని నామస్మరణ చేస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు కఠిన నిష్ఠతో చేసే నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సోమవారం ఈశ్వరారాధనకు అత్యంత ముఖ్యమైన రోజు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజలు, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా నిర్వహిస్తారు. ఇలా విశేష పూజలు చేసే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై, సంతోషాన్ని కలిగిస్తాడు.

