Tirumala Accommodation:అనుకోకుండా తిరుమలకు వెళ్లారా? ఈ టిప్ ఫాలో అయితే ఖచ్చితంగా రూమ్ దొరుకుతుంది
Tirumala Accommodation:అనుకోకుండా తిరుమలకు వెళ్లారా? ఈ టిప్ ఫాలో అయితే ఖచ్చితంగా రూమ్ దొరుకుతుంది.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? స్వామివారిని దర్శించుకోవాలా? అని ఎంతో మంది ఆశతో ఎదురుచూస్తుంటారు. కొందరు ముందుగానే ప్లాన్ చేసుకుని ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి వెళతారు.
మరికొందరు అకస్మాత్తుగా నిర్ణయించుకుని బయలుదేరుతారు. ప్లాన్ చేసుకునేవారు దర్శనం టికెట్లు, గదులు ముందస్తుగా బుక్ చేసుకుంటారు. కానీ, అప్పటికప్పుడు వెళ్లేవారికి గదులు సులభంగా దొరకవు. టీటీడీ అప్పటికప్పుడు కొందరికి గదులు ఇచ్చినా, చాలామందికి సరిపోవు. మిగతావారు లాకర్ తీసుకుని సామాన్లు పెట్టి బయటే గడపాల్సి వస్తుంది. అయితే, ఇకపై తిరుమల కొండపై రూమ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ విధానం పాటిస్తే సులభంగా గది లభిస్తుంది.
తిరుమల కొండపై గదులు కావాలంటే ఎలా?
టీటీడీ అందించే గదులతోపాటు తిరుమలలో అనేక మఠాలు కూడా ఉండేందుకు గదులు కల్పిస్తాయి. వీకెండ్స్‌లో మఠాల్లో గదులు దొరకడం కొంచెం కష్టమైనా, ఇతర రోజుల్లో సులభంగా అందుతాయి. మఠాలకు వెళ్లి దర్శనం టోకెన్ లేదా టికెట్ చూపిస్తే గదులు ఇస్తారు. కొన్ని మఠాలు టికెట్ లేకుండానే అందిస్తాయి. సాధారణ గదులు రూ.700 నుంచి ప్రారంభమవుతాయి. 5-6 మంది కలిసి ఉంటే రూ.3,000 నుంచి రూ.4,000 వరకు వసూలు చేస్తారు.
తిరుమలలో గదులు ఇచ్చే మఠాలు ఇవే!
కంచి కామకోటి మఠం, చిన్న జీయర్ స్వామి మఠం, మౌనస్వామి మఠం, విశాఖ శారదా పీఠం, శృంగేరి శంకర మఠం సహా మొత్తం 35 మఠాలు గదులు అందిస్తాయి. చాలామందికి మఠాల్లో రూమ్స్ దొరుకుతాయని తెలియక ఇబ్బంది పడుతుంటారు. కొందరు కొండ కిందికి వెళ్లి లాకర్ తీసుకుని ఉంటారు.
ఇకపై అనుకోని తిరుమల టూర్ అయినా, కొండపై మఠాల్లో గదుల కోసం ప్రయత్నించండి. అరగంట సమయం తిరిగితే సులభంగా రూమ్ దొరికే అవకాశం ఉంది.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మఠంలో సౌకర్యవంతంగా ఉండి, శ్రీవారిని దర్శించుకుని కలియుగ దైవ ఆశీస్సులు పొందండి
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

