Business

Jio Plans:జియోలో రూ.150లోపు అద్భుతమైన ప్లాన్‌లు.. 28 రోజుల వ్యాలిడిటీ..

Jio Plans:జియోలో రూ.150లోపు అద్భుతమైన ప్లాన్‌లు.. 28 రోజుల వ్యాలిడిటీ..రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం వివిధ రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా జియో ఫోన్ యూజర్ల కోసం అతి చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. తక్కువ రీఛార్జ్‌తోనే అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, SMSలను పొందవచ్చు. ఇక జియో…

జియో రూ.91 ప్లాన్ వివరాలు: ఈ రూ.91 రీఛార్జ్ ప్లాన్ రోజుకు 100MB డేటా, 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అదనంగా 200MB ఎక్స్‌ట్రా డేటా కూడా లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, 50 SMSలు, జియో టీవీ, జియో AI క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి:చపాతీలు మిగిలిపోయాయా? వాటితో ఈ 5 సూపర్ రుచికరమైన రెసిపీలు ట్రై చేయండి – లాక్కొని తింటారు!

జియో రూ.123 ప్లాన్ వివరాలు: రూ.123 రీఛార్జ్ ప్లాన్ రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా, 300 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో జియో టీవీ, జియో సావ్న్ యాప్‌లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

జియో రూ.152 ప్లాన్ వివరాలు: ఈ ప్లాన్ రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా, 300 SMSలు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను ఇస్తుంది. 28 రోజుల చెల్లుబాటుతో ఉంటుంది. ఇది జియో ఫోన్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి:మీ ఇంట్లోనే సినిమా హాల్ గా ఫీల్ పొందాలనుకుంటున్నారా… ఇదే బెస్ట్ ఆప్షన్!

రిలయన్స్ జియో రూ.150లోపు ధరల్లో జియో ఫోన్ వినియోగదారుల కోసం ఈ అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తోంది. మీరు జియో ఫోన్ ఉపయోగిస్తుంటే ఈ చౌక ప్లాన్‌లను తప్పక సద్వినియోగం చేసుకోండి. తక్కువ ఖర్చుతో అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా సౌకర్యాలను పొందవచ్చు.

గమనిక: జియో యూజర్లకు రూ.150 కంటే తక్కువ ధరలో డేటా ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి జియో ఫోన్ యూజర్లకు మాత్రమే. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కంపెనీ చౌకైన ప్లాన్ రూ.189గా ఉంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.