Beauty Tips

Herbal shampoo:ఇంట్లోనే సులభంగా హెర్బల్ షాంపూ తయారు చేసుకోవచ్చు.. ఎలా చేయాలో తెలుసా?

Herbal shampoo:ఇంట్లోనే సులభంగా హెర్బల్ షాంపూ తయారు చేసుకోవచ్చు.. ఎలా చేయాలో తెలుసా..మార్కెట్లో హెర్బల్ షాంపూలు దొరికినా, వాటిలో కెమికల్స్ లేనే లేవనే గ్యారెంటీ ఉండదు. కానీ, ఇంట్లోనే 100% కెమికల్ ఫ్రీ హెర్బల్ షాంపూ తయారు చేసుకోవచ్చంటే నమ్తారా?

ప్రతి అమ్మాయి కోరుకునేది అందమైన, ఆరోగ్యవంతమైన జుట్టు. దానికోసం రెగ్యులర్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో చేస్తారు. కానీ ఖరీదైన మార్కెట్ ప్రొడక్ట్స్ వాడినా జుట్టు రాలడం, చిట్లడం, చుండు వంటి సమస్యలు తప్పవు. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారా? అయితే కెమికల్ షాంపూలకు గుడ్‌బై చెప్పి, ఇంట్లోనే సహజమైన హెర్బల్ షాంపూ తయారు చేసుకోండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం…
ఇది కూడా చదవండి:ఈ నూనె రెండు చుక్కలు ముఖానికి రాస్తే… ముడతలు మాయమైపోతాయి!
హెర్బల్ షాంపూ తయారీ విధానం

పదార్థాలు:
వేప ఆకులు (ఒక గుప్పెడు)
తులసి ఆకులు (ఒక గుప్పెడు)
సల్ఫేట్ లేని బేస్ షాంపూ (అవసరమైతే)
(ఐచ్ఛికం) కుంకుడు కాయలు, మందార ఆకులు

విధానం:
వేప ఆకులను శుభ్రంగా కడిగి, 2 కప్పుల నీటిలో వేసి మరిగించండి.నీరు సగానికి తగ్గే వరకు మరిగించి, అందులో తులసి ఆకులు కూడా వేసి 5 నిమిషాలు మరిగించండి.చల్లారిన తర్వాత వడకట్టి, ఈ ద్రావణంలో సల్ఫేట్ లేని షాంపూ కలిపి బాటిల్‌లో నిల్వ చేయండి.శుభ్రంగా కడిగిన కుంకుడు కాయలను నీటిలో మరిగించి, మందార ఆకులు కలిపి వడకట్టండి.దీనికి వేప-తులసి మిశ్రమం కలిపితే సూపర్ హెర్బల్ షాంపూ రెడీ!
ఇది కూడా చదవండి:పగడాలు ఏ రాశి వారికి శుభప్రదం..? మీ జీవితాన్ని మార్చే అద్భుత అవకాశం..! ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఎలా వాడాలి?
జుట్టును ముందుగా సాధారణ నీటితో తడిపి, ఈ షాంపూని స్కాల్ప్‌పై రాసి మర్దన చేయండి.2-3 నిమిషాలు పాటు మసాజ్ చేసి, చల్లటి నీటితో బాగా కడిగేయండి.
ముఖ్యం: మొదటిసారి చేయి పైన ప్యాచ్ టెస్ట్ చేసుకోండి.

ప్రయోజనాలు
జుట్టు మృదువుగా, మెరిసేలా మారుతుంది. చుండు, జుట్టు రాలడం తగ్గుతాయి. చిట్లిన చివరలు రిపేర్ అవుతాయి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య తగ్గుతుంది. వారానికి 2 సార్లు వాడితే చాలు. తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం, సైడ్ ఎఫెక్ట్స్ జీరో..

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.