Gold Rate Today:షాకిస్తున్న బంగారం ధరలు.. మరల పెరిగిన బంగారం ధరలు..
Gold Rate Today:షాకిస్తున్న బంగారం ధరలు.. మరల పెరిగిన బంగారం ధరలు.. బంగారం ధర నిన్నటితో పోల్చితే నేడు స్వల్పంగా పెరిగింది. నవంబర్ 18, 2025 మంగళవారం భారత మార్కెట్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి:
24 క్యారెట్ 10 గ్రాముల బంగారం: ₹1,26,530
22 క్యారెట్ 10 గ్రాముల బంగారం: ₹1,14,950
వెండి (1 కిలో): ₹1,58,330
అయినప్పటికీ, పసిడి ధరలు ఇప్పటికీ గత ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయి కంటే సుమారు ₹8,000 తక్కువగానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గత రెండు రోజుల్లో ఒక ఔన్స్ బంగారం ధర $4,200 నుంచి $4,000కి పడిపోయింది – అంటే సుమారు $200 తగ్గింది. భారతీయ రూపాయల్లో లెక్కిస్తే ఇది దాదాపు ₹16,000 తగ్గుదల అని అర్థం. ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ విలువ బలోపేతం కావడమేనని నిపుణులు చెబుతున్నారు.
దేశీయ మార్కెట్లో ఇంకా బంగారం ధర స్థిరంగానే కొనసాగుతోంది, కానీ అంతర్జాతీయ పతనం త్వరలోనే ఇక్కడి ధరలపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read:ఇది సాధారణ ఆకు కాదు… షుగర్ నుంచి డెంగ్యూ వరకు అన్నింటికీ దివ్య ఔషధం!
కొత్త సంవత్సరంలో బంగారం ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచే అంచనాలు బలంగా ఉన్నాయి. రేట్లు మారకపోతే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెరిగి, సురక్షిత ఆస్తిగా భావించే బంగారం నుంచి నిధులు బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు.
మరోవైపు వెండి ధర మాత్రం బలంగా కొనసాగుతోంది. పారిశ్రామిక డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెండి ధరలు ఇక ముందు మరింత ఎగసి అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read:జాయింట్ అకౌంట్ తెరుస్తున్నారా? ఈ 5 కీలక విషయాలు తప్పక తెలుసుకోండి!
Also Read:మీ ఇంటి ఆవరణ లేదా బాల్కనీలో పావురాల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

