Business

Meesho : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు సాధ్యం కానిది… మీషోకు ఎలా సాధ్యమవుతోంది?

Meesho : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు సాధ్యం కానిది… మీషోకు ఎలా సాధ్యమవుతోంది..భారత్‌లో ఇ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంటే దాదాపు సగం ధరకే వస్తువులు ఇస్తున్న మీషోను చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు.“ఇంత తక్కువ ధర ఎలా సాధ్యం? నాణ్యత తక్కువ ఉంటుందేమో? చైనా మాల్‌ అని వదిలేస్తారేమో?” అనే అనుమానాలు సహజం.

కానీ నిజానికి మీషో విజయ రహస్యం నాణ్యతలో కాదు, లాజిస్టిక్స్‌లో దాగి ఉంది. దీన్ని చాలా బాగా వివరించిన లింక్డిన్ యూజర్ ప్రజ్వల్ పోస్ట్ ఆధారంగా సింపుల్‌గా చెప్పేస్తాను.
ALSO READ:పూజ గదిలోకి అడుగుపెట్టే ముందు ఈ 8 విషయాలు గుర్తుంచుకోండి… లేకపోతే..
మీషో బిజినెస్ మోడల్ యొక్క టాప్ సీక్రెట్: “రిటర్న్ లోడ్” లాజిస్టిక్స్
ఉదాహరణకు ఒక టీ-షర్ట్ మీషోలో ₹269కి అమ్ముతున్నారనుకుందాం:
తయారీ ఖర్చు → ~₹150
మార్కెటింగ్ → ~₹50
లాజిస్టిక్స్ (సాధారణంగా) → ₹60–80
ఈ లెక్కన చూస్తే మీషోకు లాభం దాదాపు జీరో లేదా నష్టమే కనిపిస్తుంది.

కానీ మీషో లాజిస్టిక్స్ ఖర్చును కేవలం ₹20–30కే దించేస్తోంది! ఎలా?
మేజిక్ ఏమిటంటే…
భారతదేశంలో రోజూ లక్షలాది ట్రక్కులు ఒక నగరం నుంచి మరో నగరానికి వస్తువులు తీసుకెళ్తాయి.వెళ్లేటప్పుడు ఫుల్ లోడ్ ఉంటుంది… కానీ తిరిగి వస్తున్నప్పుడు 70–80% ట్రక్కులు ఖాళీగానే వస్తాయి!మీషో ఈ “రిటర్న్ ట్రిప్ ఖాళీ ట్రక్కుల”ను ట్రాక్ చేసే అద్భుతమైన సాఫ్ట్‌వేర్ తయారు చేసుకుంది.ఆ ట్రక్కుల్లో తమ పార్శిల్స్‌ను అతి తక్కువ ధరకు లోడ్ చేస్తుంది (ట్రక్ ఓనర్‌కు కూడా ఎక్స్‌ట్రా డబ్బు వస్తుంది కాబట్టి వాళ్లు సంతోషంగానే ఒప్పుకుంటారు).

ఫలితం:
మీషో సగటు డెలివరీ ఖర్చు కేవలం ₹37 మాత్రమే!
(అమెజాన్/ఫ్లిప్‌కార్ట్ సగటు డెలివరీ ఖర్చు ₹80–120)
మీషో ఏం చేయడం లేదు (ఇదే దాని బలం):
ALSO READ:ఇడ్లీలు మెత్తగా రావట్లేదా? స్పాంజీగా, తెల్లగా రావాలంటే ఈ హోటల్ స్టైల్ రెసిపీని ఫాలో అయిపోండి..
భారీ వేర్‌హౌస్‌లు లేవు
సొంత డెలివరీ ఫ్లీట్ (ట్రక్కులు, బైక్స్) లేవు
ఖరీదైన ఎయిర్ కార్గో ఉపయోగించదు
పెద్ద పెద్ద TV యాడ్స్ చేయదు (మెజారిటీ మార్కెటింగ్ రీసెల్లర్స్ ద్వారానే)

ఎవరిని టార్గెట్ చేస్తోంది?
భారతదేశంలో 10% మంది మాత్రమే “రేపే కావాలి, ధర ఎంతైనా పర్వాలేదు” అనుకుంటారు → వీళ్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తీసుకుంటాయి.మిగతా 90% మంది “₹200–300 ఆదా అవుతుందంటే 8–12 రోజులు వెయిట్ చేయడం పర్వాలేదు” అనుకుంటారు → వీళ్లందరినీ మీషో ఒక్కటే టార్గెట్ చేస్తోంది.

సారాంశం:
మీషో విజయ రహస్యం ఒక్కటే –“ఖాళీగా తిరిగి వెళ్తున్న ట్రక్కులను గుర్తించి, వాటిలో సరుకు దిగ్గిర పడేయడం”ఇది asset-light మోడల్ (సొంత ఆస్తులు దాదాపు జీరో).లాజిస్టిక్స్ పీడకలను లాభదాయక అస్త్రంగా మార్చుకపోయింది మీషో.కాబట్టి మీషోలో వస్తువులు చవకగా ఉన్నాయంటే… అది మోసం కాదు, తెలివైన బిజినెస్ స్ట్రాటజీ!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/