Beauty Tips

Hair Growth Tips:వారంలో రెండు సార్లు ఈ నూనె రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!

Hair Growth Tips:వారంలో రెండు సార్లు ఈ నూనె రాస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.. ఈ రోజుల్లో చుండ్రు, జుట్టు రాలే సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్‌లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ తాత్కాలిక ఉపశమనం ఇచ్చినా, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.

అయితే, ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారుచేసుకునే ఈ హెయిర్ ఆయిల్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుత ఫలితాలు ఇస్తుంది. ఒకసారి తయారు చేసుకుంటే నెల రోజుల పాటు వాడుకోవచ్చు.
ALSO READ:లవంగాలతో ఇవి కలిపి తలకు రాస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది…
తయారీ విధానం:
ఒక గాజు జార్‌లో ఈ కింది పదార్థాలు వేసి బాగా కలపండి:
1 స్పూన్ ఎండిన గులాబీ రేకులు (డ్రై రోజ్ పెటల్స్)
1 స్పూన్ మెంతి పొడి
1 స్పూన్ ఉసిరి పొడి
1 స్పూన్ కలోంజీ గింజలు (నిగెల్లా సీడ్స్)
6 మందార పూల రేకులు (హిబిస్కస్)
చిన్న ముక్క వట్టివేరు (లైకోరైస్ రూట్)
1 కప్పు కొబ్బరి నూనె
అర కప్పు బాదం నూనె

అన్నీ కలిసేలా మిక్స్ చేసి, మూత పెట్టి 5 రోజులు అలాగే ఉంచండి. తర్వాత సన్నని గుడ్డతో ఫిల్టర్ చేసి బాటిల్‌లో పోసుకోండి.
ALSO READ:జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడానికి సహజమైన చిట్కాలు..
వాడే విధానం:
రాత్రి పడుకునే ముందు తలకు బాగా రాసి, 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయండి. షవర్ క్యాప్ పెట్టుకుని మరుసటి రోజు ఉదయం రీఠా (కుంకుడుకాయలు)తో తల స్నానం చేయండి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే:జుట్టు రాలే సమస్య, చుండ్రు పూర్తిగా తగ్గుతాయి.జుట్టు కుదుళ్లకు మంచి పోషణ అంది ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.జుట్టు నల్లగా, నిగనిగలాడేలా మెరుస్తుంది.

ఈ సహజ చిట్కాను కాస్త ఓపికతో ఫాలో అయితే జుట్టు సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. తప్పక ప్రయత్నించండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/