Beauty Tips

Rice For Hair:కలబందతో కలిపి రాస్తే… ఎంత పల్చటి జుట్టైనా ఒత్తుగా, పొడవుగా పెరిగే అద్భుత హోం రెమెడీ!

Rice For Hair:కలబందతో కలిపి రాస్తే… ఎంత పల్చటి జుట్టైనా ఒత్తుగా, పొడవుగా పెరిగే అద్భుత హోం రెమెడీ.. ఈ రోజుల్లో చలికాలం వచ్చిందంటే జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువైపోతాయి. తలలో తేమ తగ్గి జుట్టు పొడిగా మారడం, చుండ్రు పెరగడం, జుట్టు రాలిపోవడం వంటి ఇబ్బందులు సాధారణం.

ఇలాంటి సమయంలో కంగారు పడి మార్కెట్ ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకే ఇంట్లోనే సహజంగా ఉండే పదార్థాలతో తయారుచేసే చిట్కాలు బెస్ట్ – ఖర్చు తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ జీరో!

ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ రెమెడీతో పొడి జుట్టు, చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. అంతేకాదు, జుట్టు కుదుళ్లు బలపడి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగే అవకాశం ఉంది.
ALSO READ:కొబ్బరి నూనెలో ఈ ఆకును మరిగించి రాస్తే తెల్లజుట్టు నల్లగా మారటం ఖాయం..
ఏమి కావాలి?
అర కప్పు బియ్యం
ఒక గ్లాసు నీళ్లు
1 స్పూన్ తాజా కలబంద (అలోవెరా) జెల్ (మార్కెట్ జెల్ కంటే ఇంటి కలబంద నుంచి తీసుకుంటే సూపర్!)
1 స్పూన్ ఆపిల్ సైడర్ వినిగర్

ఎలా తయారు చేయాలి?
రాత్రి ఒక బౌల్‌లో అర కప్పు బియ్యం వేసి, ఒక గ్లాసు నీళ్లు పోసి అలాగే వదిలేయండి. మరుసటి రోజు ఉదయం బియ్యాన్ని వడకట్టి, ఆ నీటిని సపరేట్ చేయండి. ఈ నానబెట్టిన బియ్యం నీటిలో 1 స్పూన్ కలబంద జెల్, 1 స్పూన్ ఆపిల్ సైడర్ వినిగర్ వేసి బాగా కలపండి.
ALSO READ:ముఖంపై మృత కణాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేసే సహజ స్క్రబ్‌లు
ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి, జుట్టు కుదుళ్ల నుంచి కొనల వరకు బాగా స్ప్రే చేయండి. ఒక గంట సేపు అలాగే వదిలేసి, తర్వాత కుంకుడుకాయల పౌడర్ (శికాకాయ)తో తల స్నానం చేయండి.
ఎంతసేపు చేయాలి?

వారంలో 2 సార్లు ఈ రెమెడీ ఫాలో అయితే చాలు. క్రమం తప్పకుండా చేస్తే పొడి జుట్టు మెరిసిపోతుంది, చుండ్రు తగ్గుతుంది, జుట్టు రాలడం ఆగి బలంగా పెరుగుతుంది.

ఈ మిశ్రమంలోని పదార్థాలు – నానబెట్టిన బియ్యం నీరు జుట్టును పోషించి బలపరుస్తుంది, కలబంద జెల్ తేమ ఇచ్చి కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆపిల్ సైడర్ వినిగర్ స్కాల్ప్ pH బ్యాలెన్స్ చేసి చుండ్రును తగ్గిస్తుంది.కాస్త ఓపిక పట్టి ఈ సహజ చిట్కాను ట్రై చేయండి… మీ జుట్టు మరింత అందంగా, ఒత్తుగా మారినట్టు కనిపిస్తుంది!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/