Kalonji For Hair:జుట్టు రాలడం, చుండ్రుతో ఇబ్బందా? ఈ ఆకులు గింజల డికాక్షన్‌తో సమస్యలకు చెక్..
Kalonji For Hair:జుట్టు రాలడం, చుండ్రుతో ఇబ్బందా? ఈ ఆకులు గింజల డికాక్షన్‌తో సమస్యలకు చెక్..ఈ రోజుల్లో జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలు ఒక్కసారి వచ్చాక అంత సులభంగా తగ్గవు. మార్కెట్‌లో లభించే కెమికల్ ఉత్పత్తులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకే ఇంట్లోనే సహజ పదార్థాలతో సులభంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఇప్పుడు చెప్పే సహజ రెమెడీని క్రమం తప్పకుండా అనుసరిస్తే జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. ఇందులో మందార (హిబిస్కస్) ఆకులు, పూలు మరియు కలోంజి (నల్ల జీలకర్ర) గింజలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ALSO READ:లవంగాలతో ఇవి కలిపి తలకు రాస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది…
తయారీ విధానం:
5-6 మందార ఆకులు, 4 మందార పూలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.ఒకటిన్నర గ్లాసు నీటిని గిన్నెలో పోసి మరిగించండి.నీరు వేడెక్కాక మందార ఆకులు, పూలు వేసి, 2 స్పూన్ల కలోంజి గింజలు కూడా జోడించండి.నీరు సగం అయ్యే వరకు మరిగించి, స్టవ్ ఆఫ్ చేయండి.వడకట్టి నీటిని పూర్తిగా చల్లార్చండి.చల్లారిన నీటిలో 1 స్పూన్ వేప నూనె జోడించి బాగా కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి.
ఉపయోగించే విధానం:
జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ఈ ద్రావణాన్ని స్ప్రే చేయండి.5 నిమిషాలు మసాజ్ చేసి, గంటసేపు అలాగే ఉంచండి.తర్వాత కుంకుడుకాయ పొడి (షికాకాయ)తో తలస్నానం చేయండి.వారంలో 2 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ALSO READ:జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడానికి సహజమైన చిట్కాలు..
ఎందుకు పని చేస్తుంది?
మందార ఆకులు, పూలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి రాలడాన్ని తగ్గిస్తాయి, చుండ్రును నివారిస్తాయి మరియు జుట్టును ఒత్తుగా, నిగనిగలాడేలా చేస్తాయి.
కలోంజి గింజలు జుట్టు రాలడాన్ని అరికట్టి, స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, చుండ్రు సమస్యను తగ్గిస్తాయి.
వేప నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
ఈ రెమెడీని క్రమం తప్పకుండా అనుసరిస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు సమస్య కూడా నియంత్రణలోకి వస్తుంది. సహజమైన ఈ చిట్కా మీ జుట్టును ఆరోగ్యవంతంగా మారుస్తుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

