Gold Buying:బంగారం కొనేప్పుడు ఈ ‘చిన్న లాజిక్’ మిస్ అయితే 50% నష్టం.. నిపుణుల హెచ్చరిక!
Gold Buying:బంగారం కొనేప్పుడు ఈ ‘చిన్న లాజిక్’ మిస్ అయితే 50% నష్టం.. నిపుణుల హెచ్చరిక.. ప్రస్తుతం బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. గడిచిన ఏడాదిలో బంగారం ఏకంగా 80% రిటర్న్స్ ఇచ్చింది. అంటే కిందటేడాది లక్ష రూపాయలు పెట్టినవారికి ఇప్పుడు రూ.1.8 లక్షలు అయ్యింది.
ఇది చూసి అందరూ ఎగబడి బంగారం కొంటున్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీరు ఎంచుకునే విధానం సరిగ్గా లేకపోతే.. మీకు వచ్చిన లాభంలో 30% నుంచి 50% పన్నుల రూపంలోనే పోయే ప్రమాదం ఉంది. మరి తెలివిగా ఎలా పెట్టుబడి పెట్టాలి?
1. అతిపెద్ద తప్పు – ఫిజికల్ గోల్డ్ (Physical Gold): చాలామంది ఆభరణాలు, కాయిన్స్ కొంటారు. ఇది పెట్టుబడి పరంగా వరస్ట్ ఆప్షన్.
నష్టం ఎక్కడ?: కొనేటప్పుడే 3% GST కట్టాలి. తయారీ ఖర్చులు (Making Charges) అదనం.
పన్ను మోత: 2 సంవత్సరాల లోపు అమ్మితే మీ ఆదాయ పన్ను స్లాబ్ (Slab Rate) ప్రకారం 30% వరకు పన్ను కట్టాలి. 2 ఏళ్ల తర్వాత అమ్మితే 12.5% పన్ను (LTCG) కట్టాలి. ఇవన్నీ పోను మీ చేతికి మిగిలేది చాలా తక్కువ.
2. గోల్డ్ ఈటీఎఫ్ & మ్యూచువల్ ఫండ్స్ (Better Option): నగలు వద్దు, పెట్టుబడి ముద్దు అనుకునేవారికి ఇవి బెటర్.పన్ను: 12 నెలల లోపు అమ్మితే స్లాబ్ రేటు ప్రకారం పన్ను పడుతుంది. ఏడాది దాటితే 12.5% పన్ను కట్టాలి. ఫిజికల్ గోల్డ్‌తో పోలిస్తే ఇందులో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ గొడవ ఉండదు కాబట్టి కాస్త నయం.
ALSO READ:వేల రూపాయల ఆయిల్స్ వద్దు.. మన ఇంటి పెరట్లో ఉండే ఈ ఆకుతో జుట్టు పట్టుకుచ్చులుగా మారుతుంది!
3. అసలైన విజేత – సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB – The Best): తెలివైన ఇన్వెస్టర్లు ఎంచుకునేది ఇదే. దీర్ఘకాలం (Long Term) కోసం ఇది బెస్ట్.
వడ్డీ: బంగారం ధర పెరిగితే వచ్చే లాభం ఎలాగూ ఉంటుంది. దానికి అదనంగా ప్రభుత్వం ఏటా 2.5% వడ్డీ ఇస్తుంది.
పన్ను ఉండదు: ఇదే అసలు లాజిక్. 8 ఏళ్ల మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు బాండ్లను ఉంచుకుంటే.. మీకు వచ్చిన లాభంపై ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పనిలేదు (Tax Free).
లాజిక్ ఏంటంటే: మీరు షార్ట్ టర్మ్‌లో (తక్కువ కాలానికి) లాభం కోసం చూస్తుంటే భారీగా పన్ను కట్టాల్సి వస్తుంది. అదే SGBలో 8 ఏళ్లు ఆగితే, పన్ను మిగులుతుంది + వడ్డీ వస్తుంది. కాబట్టి ఆభరణాల మోజులో పడి నష్టపోకండి.
ముగింపు: అలంకరణ కోసం అయితే నగలు కొనండి. కానీ భవిష్యత్తు కోసం, లాభాల కోసం అయితే కచ్చితంగా SGB (Sovereign Gold Bond) మాత్రమే ఎంచుకోండి. లేదంటే సగం లాభం ప్రభుత్వానికి పన్ను రూపంలో కట్టాల్సిందే!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/
TAGS:gold investment options India, sovereign gold bonds tax benefits, digital gold risks Sebi warning, best gold ETFs India, gold mutual funds returns, physical gold vs digital gold, ఇండియాలో బంగారంలో పెట్టుబడి మార్గాలు, సావరిన్ గోల్డ్ బాండ్ల పన్ను లాభాలు, డిజిటల్ గోల్డ్ రిస్క్, గోల్డ్ ఈటీఎఫ్, బంగారం మ్యూచువల్ ఫండ్స్, ఫిజికల్ గోల్డ్ vs డిజిటల్ బంగారం, బంగారం ధర పెరుగుదల, బంగారంలో పెట్టుబడి

