Business

Vande Bharat:వందే భారత్ ఎక్కేలోపే డోర్లు క్లోజ్ అయ్యాయా? కంగారు వద్దు.. ఈ సీక్రెట్ తెలిస్తే ట్రైన్ మిస్ అవ్వరు!

Vande Bharat:వందే భారత్ ఎక్కేలోపే డోర్లు క్లోజ్ అయ్యాయా? కంగారు వద్దు.. ఈ సీక్రెట్ తెలిస్తే ట్రైన్ మిస్ అవ్వరు.. వందే భారత్ రైలు.. వేగం, సౌకర్యం, లగ్జరీకి కేరాఫ్ అడ్రస్. అయితే ఈ రైలులో ఉన్న ‘ఆటోమేటిక్ డోర్ సిస్టమ్’ (Automatic Doors) వల్ల కొత్త చిక్కులు వస్తున్నాయి. స్టేషన్‌కు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా, లేదా లగేజీ సర్దుకునే లోపే డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంటాయి. కళ్ళ ముందే ట్రైన్ ఉన్నా.. ఎక్కలేక చాలామంది నిస్సహాయంగా ఉండిపోతున్నారు.

డోర్లు క్లోజ్ అయితే ఏం చేయాలి? (The Secret Trick) మీరు స్టేషన్‌కు వచ్చేసరికి వందే భారత్ డోర్లు క్లోజ్ అయిపోయి, ట్రైన్ ఇంకా ప్లాట్‌ఫామ్ మీదే ఉంటే.. అస్సలు కంగారు పడకండి.

గార్డ్ బోగీకి పరుగెత్తండి: ప్యాసింజర్ డోర్లు క్లోజ్ అయినా సరే, రైలు చివరన ఉండే ‘గార్డ్ క్యాబిన్’ (Guard Coach) డోర్ మాత్రం తెరిచే ఉంటుంది.

గార్డ్ అనుమతితో మీరు ఆ బోగీలోంచి రైలు ఎక్కవచ్చు. అక్కడి నుండి లోపలికి వెళ్లి మీ సీటును చేరుకోవచ్చు.

అలాగే, గమ్యస్థానం వచ్చాక లగేజీ వల్ల టైంకి దిగలేకపోయినా.. వెంటనే చివరి బోగీకి వెళ్లి గార్డ్ సాయంతో దిగవచ్చు.
ALSO READ:గడ్డిలాంటి జుట్టు పట్టులా మారాలంటే.. గుడ్డులో ఇది కలిపి రాయాల్సిందే!
ముఖ్య గమనిక: ఇది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. సాధ్యమైనంత వరకు ట్రైన్ రావడానికి ముందే ప్లాట్‌ఫామ్ మీద సిద్ధంగా ఉండటం ఉత్తమం.

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్: వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే అస్సాం-బెంగాల్ మధ్య స్లీపర్ రైలు మొదలవ్వగా.. త్వరలోనే హైదరాబాద్ – ఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇదే జరిగితే ప్రయాణం మరింత సులభం అవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/