Gold:నకిలీ నగలు కొంటున్నారా? అయితే మీరు డబ్బులు తగలబెడుతున్నట్టే! గిల్ట్ vs గోల్డ్.. ఏది బెస్ట్?
Gold:నకిలీ నగలు కొంటున్నారా? అయితే మీరు డబ్బులు తగలబెడుతున్నట్టే! గిల్ట్ vs గోల్డ్.. ఏది బెస్ట్.. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు చూసి భయపడి చాలామంది ఆడవాళ్ళు ‘గిల్ట్ నగల’ (Imitation Jewellery) వైపు మొగ్గు చూపుతున్నారు. “ఎలాగో రోజు వాడం కదా, అచ్చం బంగారం లాగే ఉంటాయి కదా” అని వేలకు వేలు పోసి వీటిని కొంటున్నారు. కానీ మీరు చేసే అతి పెద్ద తప్పు అదేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గిల్ట్ నగల వెనుక ఉన్న నగ్న సత్యం:
విలువ సున్నా: మీరు రూ. 5,000 పెట్టి గిల్ట్ హారం కొన్నా.. షాపు నుంచి బయటకు రాగానే దాని విలువ ‘సున్నా’. తిరిగి ఎవరూ కొనరు.
తాత్కాలిక మెరుపు: ఎంత కాస్ట్లీ గిల్ట్ నగలు అయినా.. కొన్నాళ్లకే రంగు మారిపోతాయి.
డబ్బు వృథా: ఒక ఐదేళ్లలో మీరు గిల్ట్ నగల కోసం రూ. 25,000 ఖర్చు చేస్తారు అనుకుందాం. ఆ నగలు చివరికి చెత్తబుట్టలోకే వెళ్తాయి.
అదే డబ్బుతో ‘రియల్ గోల్డ్’ కొనొచ్చు! ఎలాగంటే? బంగారం అంటే కేవలం 22 క్యారెట్లే కాదు. తక్కువ బడ్జెట్ ఉన్నవారి కోసం ఇప్పుడు కొత్త ఆప్షన్లు వచ్చాయి.
14 క్యారెట్ల బంగారం: ఇది కూడా అసలైన బంగారమే. తిరిగి అమ్మితే డబ్బులు వస్తాయి. 2 గ్రాముల 14 క్యారెట్ల కమ్మల ధర సుమారు రూ. 24,000 మాత్రమే.
9 క్యారెట్ల బంగారం: ఇంకా తక్కువ బడ్జెట్ ఉంటే.. 9 క్యారెట్ల గోల్డ్ కొనొచ్చు. దీని ధర సుమారు రూ. 14,000 మాత్రమే.
లాభం: మీరు గిల్ట్ నగల కోసం పెట్టే రూ. 25 వేలతో.. 14 క్యారెట్ల బంగారు నగలు కొంటే, అవి ఎప్పటికీ పాడవ్వవు. అవసరం వస్తే అమ్ముకోవచ్చు కూడా.
గిల్ట్ నగలు కొని డబ్బును నీళ్ళల్లో పోయకండి. అదే డబ్బును దాచుకుని 14 లేదా 9 క్యారెట్ల తక్కువ తూకం (Light Weight) బంగారు నగలు కొనండి. ఇది మీ అందాన్ని పెంచుతుంది.. ఆపదలో ఆదుకుంటుంది!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

