Beauty Tips

Skin Care Tips:వాడి పారేసే సబ్బు ముక్కలతో అద్భుతం.. సన్ టాన్, మచ్చలు మాయం! ఇలా ట్రై చేస్తే ముఖం మెరవడం ఖాయం

Skin Care:వాడి పారేసే సబ్బు ముక్కలతో అద్భుతం.. సన్ టాన్, మచ్చలు మాయం! ఇలా ట్రై చేస్తే ముఖం మెరవడం ఖాయం..మన ఇంట్లో సబ్బు అరిగిపోయి చిన్న ముక్కగా మారగానే దాన్ని డస్ట్ బిన్ లో పారేస్తుంటాం. కానీ, ఆ చిన్న ముక్కలతోనే మీ చర్మాన్ని బంగారంలా మెరిపించవచ్చని మీకు తెలుసా? అవును, వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్లకు వెళ్లాల్సిన పనిలేదు.

వంటింట్లో దొరికే వాటితో, మిగిలిన సబ్బు ముక్కలతో ఇలా చేస్తే సన్ టాన్, మచ్చలు, ఓపెన్ పోర్స్ సమస్యలు ఇట్టే మాయమవుతాయి.ఆ మ్యాజికల్ హోమ్ రెమిడీ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం!

కావాల్సిన పదార్థాలు:
మిగిలిన సబ్బు ముక్కలు (చిన్నవి)
కమలాకాయ తొక్కలు (3 కాయలవి)
నిమ్మకాయ (1)
పాలు (అర కప్పు)
బాదం నూనె (1 స్పూన్)

తయారీ విధానం – స్టెప్ బై స్టెప్:
ముందుగా కమలా తొక్కలు, ఒక నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి, అందులో ఈ ముక్కలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా ఉడికించాలి.

ఉడికిన ముక్కల నుంచి నీటిని తీసేసి, వాటిని మిక్సీ జార్ లో వేసుకోవాలి. దీనికి అరకప్పు పాలను జత చేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్ట్ ను వడకట్టి చిక్కటి రసాన్ని (Juice) తీసుకోవాలి.

ఇప్పుడు మిగిలిన సబ్బు ముక్కలను తురుముకుని, ఈ రసంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సబ్బు పూర్తిగా కరిగే వరకు వేడి చేసి, స్టవ్ ఆఫ్ చేయాలి.మిశ్రమం చల్లారాక ఒక స్పూన్ బాదం నూనె కలిపి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.

ఎలా వాడాలి?
దీనిని ఫ్రిజ్ లో పెడితే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.ప్రతిరోజూ స్నానం చేసేటప్పుడు సబ్బుకు బదులుగా ఈ మిశ్రమాన్ని ముఖానికి, శరీరానికి పట్టించి రుద్దుకోవాలి.

దీని వల్ల కలిగే లాభాలు:
కమలా తొక్క: ఇందులో ఉండే విటమిన్ సి సన్ టాన్ ను తొలగించి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది (Anti-aging).
నిమ్మకాయ: నాచురల్ బ్లీచ్ లా పనిచేసి మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
పాలు & బాదం నూనె: చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తాయి.

కేవలం వారం రోజుల్లోనే మీ చర్మంలో వచ్చే మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే ట్రై చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/