Cloves For Hair:జుట్టు రాలుతోందని కంగారు పడుతున్నారా? లవంగాలలో ఇది కలిపి రాస్తే.. 100% రిజల్ట్ పక్కా!
Cloves For Hair:జుట్టు రాలుతోందని కంగారు పడుతున్నారా? లవంగాలలో ఇది కలిపి రాస్తే.. 100% రిజల్ట్ పక్కా.. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘జుట్టు రాలడం’ (Hair Fall). దువ్వెన తగిలిస్తే చాలు జుట్టు చేతికి వచ్చేస్తోంది. ఇలాగే కొనసాగితే బట్టతల (Baldness) వస్తుందేమోనని భయపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఖరీదైన ఆయిల్స్, షాంపూలు వాడి విసిగిపోయారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కా!
మన ఇంట్లో దొరికే లవంగాలు, అల్లంతో చేసిన ఈ న్యాచురల్ ఆయిల్ వాడితే, జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు.. ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. మరి ఆ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
కావలసిన పదార్థాలు:
అల్లం: 4 అంగుళాల ముక్క (మెత్తగా పేస్ట్ చేసుకోవాలి)
లవంగాలు: 2 స్పూన్ల పొడి
ఆలివ్ ఆయిల్: అర కప్పు
తయారీ విధానం – చాలా సింపుల్:
ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో అర కప్పు ఆలివ్ ఆయిల్ పోయాలి.నూనె కాస్త వేడెక్కాక, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పేస్ట్, రెండు స్పూన్ల లవంగాల పొడి వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై దాదాపు 10 నిమిషాల పాటు మరిగించాలి.
అనంతరం స్టవ్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి.చల్లారిన తర్వాత ఒక పలుచని క్లాత్ సాయంతో నూనెను వడగట్టి, ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఈ నూనె నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
వాడే విధానం: తయారు చేసుకున్న ఈ నూనెను తల స్నానానికి ఒక గంట ముందు.. జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. గంట తర్వాత కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూతో తల స్నానం చేయాలి.
ఇలా ఎందుకు చేయాలి? (Benefits):
లవంగాలు: ఇందులో ఉండే ‘యూజీనాల్’ (Eugenol) అనే సమ్మేళనం జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఇది తెల్లజుట్టును నల్లగా మార్చడంలోనూ సహాయపడుతుంది.
అల్లం: ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు జుట్టు కుదుళ్లను (Hair Follicles) గట్టిపరుస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ పెంచి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి.
రిజల్ట్: వారానికి రెండు సార్లు ఓపికగా ఇలా చేస్తే.. ఖచ్చితంగా మీ జుట్టు రాలడం తగ్గి, పట్టుకుచ్చులుగా మారుతుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఈ ఎఫెక్టివ్ రెమెడీని మీరు కూడా ట్రై చేయండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

