Beauty Tips

Hair Fall:జుట్టు రాలడం ఆగిపోయి, 3 రెట్లు వేగంగా పెరగాలా? ఈ పొడితో ఇలా చేస్తే చాలు!

Hair Fall:జుట్టు రాలడం ఆగిపోయి, 3 రెట్లు వేగంగా పెరగాలా? ఈ పొడితో ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలుతోందని, చుండ్రు (Dandruff) తగ్గట్లేదని బాధపడుతున్నారా? ఖరీదైన ట్రీట్మెంట్లు అవసరం లేదు. మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఈ స్పెషల్ పేస్ట్ వాడితే.. జుట్టు రాలడం తగ్గి, 3 రెట్లు వేగంగా పెరుగుతుంది. తెల్లజుట్టు కూడా నల్లబడుతుంది. ఆ సింపుల్ చిట్కా ఏంటో చూసేయండి!

కావలసిన పదార్థాలు:
అల్లం: ఒక మీడియం సైజు ముక్క (రసం తీసుకోవాలి)
పెరుగు: 3 స్పూన్లు
మందార పువ్వుల పొడి: 2 స్పూన్లు (ఇంట్లో ఎండబెట్టినవి లేదా మార్కెట్లో దొరికే పౌడర్)

తయారీ విధానం:
ముందుగా అల్లం ముక్కను శుభ్రంగా కడిగి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసి, వడగట్టి అల్లం రసం తీసుకోవాలి.ఒక బౌల్ లో అల్లం రసం తీసుకుని, అందులో మూడు స్పూన్ల పెరుగు, రెండు స్పూన్ల మందార పువ్వుల పొడి వేయాలి.ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా కలపాలి. అంతే.. మన మ్యాజికల్ హెయిర్ ప్యాక్ రెడీ!

వాడే విధానం: ఈ పేస్ట్‌ని జుట్టు కుదుళ్ల (Roots) నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. ఒక అరగంట (30 నిమిషాలు) పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత కుంకుడుకాయలు లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఇలా ఎందుకు చేయాలి? (Benefits):
మందార పొడి: ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్-సి జుట్టును కుదుళ్ల నుంచి బలంగా మారుస్తుంది. ఇందులోని యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును పూర్తిగా తొలగిస్తాయి. తల పొడిబారకుండా తేమగా ఉంచుతుంది.

అల్లం: ఇది జుట్టు పెరుగుదలను (Hair Growth) అద్భుతంగా ప్రేరేపిస్తుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు, మినరల్స్ జుట్టు రాలడాన్ని అడ్డుకుని, కుదుళ్లను దృఢంగా చేస్తాయి.

పెరుగు: జుట్టుకు కావాల్సిన పోషణనిచ్చి, సిల్కీగా మారుస్తుంది.

రిజల్ట్: వారానికి రెండు సార్లు ఓపికగా ఇలా చేస్తే.. జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా మాయమవుతుంది. తప్పకుండా ట్రై చేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/