Vastu Tips:ఆర్థిక కష్టాలా? సాయంత్రం వేళ కర్పూరంతో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి తలుపు తట్టడం ఖాయం!
Vastu Tips:ఆర్థిక కష్టాలా? సాయంత్రం వేళ కర్పూరంతో ఇలా చేస్తే.. లక్ష్మీదేవి తలుపు తట్టడం ఖాయం.. ఇంట్లో ప్రశాంతత లేదా? ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా? అయితే మీ ఇంట్లో చిన్న వాస్తు దోషం లేదా ప్రతికూల శక్తి (Negative Energy) ప్రభావం ఉండవచ్చు. వీటన్నింటికీ చెక్ పెట్టే అద్భుత శక్తి ‘కర్పూరం’ సొంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్పూరంతో ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆ విశేషాలేంటో చూడండి.
1. వాస్తు దోషాలకు చెక్!
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే వాస్తు దోషం కారణం కావచ్చు. దీనికి పరిష్కారంగా.. ప్రతిరోజూ సాయంత్రం ఒక వెండి లేదా రాగి పాత్రలో కర్పూరాన్ని వెలిగించండి. ఆ పొగను ఇల్లంతా చూపించండి. ఇలా చేస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ పోయి, దైవిక శక్తి ప్రవేశిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది.
2. డబ్బు ఇబ్బందులు ఉన్నాయా?
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఇది అద్భుతమైన చిట్కా. గురువారం లేదా శుక్రవారం రోజున కర్పూరంతో పాటు రెండు లవంగాలను (Cloves) కలిపి వెలిగించండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
3. గ్రహ దోష నివారణకు..
జాతకంలో రాహు-కేతువుల ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటే.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నెయ్యిలో ముంచిన కర్పూరాన్ని వెలిగించండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మీరు చేసే పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది.
4. దిష్టి తగలకుండా..
బయటి వారి నరదిష్టి, దుష్టశక్తులు ఇంట్లోకి రాకూడదంటే.. ఇంటి ప్రధాన ద్వారం (Main Door) వద్ద నిత్యం కర్పూరం వెలిగించడం మంచిది. కర్పూరం కరుగుతున్నట్లే మీ కష్టాలు కూడా కరిగిపోతాయని శాస్త్రం చెబుతోంది.
గమనిక: ఇది విశ్వాసం, సాంప్రదాయంపై ఆధారపడిన విషయం. నమ్మకంతో ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

