Beauty Tips

Face Glow Tips:వేసవిలో ముఖం జిడ్డుగా మారుతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మెరిసిపోయేలా చేసే అద్భుత చిట్కాలు!

Face Glow Tips:వేసవిలో ముఖం జిడ్డుగా మారుతోందా? రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే మెరిసిపోయేలా చేసే అద్భుత చిట్కాలు.. వేసవి వచ్చిందంటే చాలు.. జిడ్డు చర్మం (Oily Skin) ఉన్నవారి పాట్లు అన్నీ ఇన్నీ కావు. ముఖం ఎంత శుభ్రం చేసుకున్నా, కాసేపటికే మళ్ళీ జిడ్డుగా మారిపోతుంది. అందంగా కనిపించడానికి మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్ వాడుతుంటారు. కానీ వాటివల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది.

అందుకే, పార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా.. మీ వంటింట్లో దొరికే వస్తువులతోనే జిడ్డును వదిలించుకుని, ముఖాన్ని కాంతివంతంగా మార్చుకునే టాప్ 5 చిట్కాలు ఇవే!

1. గోధుమ పిండి మ్యాజిక్:
చపాతీ పిండి కోసం వాడే గోధుమ పిండి జిడ్డును పీల్చుకోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది.కొంచెం గోధుమ పిండిలో తగినన్ని నీళ్లు పోసి పేస్ట్‌లా కలుపుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న అధిక నూనెను పూర్తిగా తొలగిస్తుంది.

2. పచ్చిపాలు – దోసకాయ రసం:
వేసవిలో చర్మానికి చల్లదనాన్ని ఇచ్చే ప్యాక్ ఇది.రెండు స్పూన్ల పచ్చిపాలు, రెండు స్పూన్ల దోసకాయ రసం, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, బాగా ఆరాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు పోయి ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.

3. ఉప్పు నీటి చిట్కా:
ఇది చాలా సింపుల్ చిట్కా. ఒక సీసా నీటిలో చిన్న స్పూన్ ఉప్పు కలపాలి. రోజులో వీలైనన్ని సార్లు ఈ నీటితో ముఖం కడుక్కుంటూ ఉంటే, ఉప్పు జిడ్డును లాగేసు కుని ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

4. బాదం – తేనె:
రెండు లేదా మూడు బాదం పప్పులను మెత్తగా నూరి, దానికి అర స్పూన్ తేనె కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే, చర్మం మృదువుగా మారుతుంది.

5. ఆపిల్ – గుడ్డు ఫేస్ ప్యాక్ (Special Pack):
మీకు సమయం ఉంటే ఈ ప్యాక్ వేసుకోండి, ఫలితం అద్భుతంగా ఉంటుంది.అరకప్పు ఆపిల్ గుజ్జు, అరకప్పు ఓట్స్ (Oatmeal), అర స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన.. ఇవన్నీ బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

చివరిగా ఒక మాట: కెమికల్స్ ఉన్న సబ్బులు, ఫేస్ వాష్‌లు వాడే బదులు.. స్నానానికి వెళ్ళే ముందు కాస్త వెనిగర్‌లో దూదిని ముంచి ముఖమంతా రాసుకుని స్నానం చేస్తే జిడ్డు సమస్యే ఉండదు.

ఈ వేసవిలో ఈ సహజ చిట్కాలు పాటించండి.. మీ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/