Gold Ring:ఆకాశన్నంటుతున్న బంగారం ధరలు: 2 గ్రాములతో ఉంగరం చేయించుకోవాలంటే పక్కా లెక్క ఎంతవుతుందో తెలుసా?
Gold Ring:ఆకాశన్నంటుతున్న బంగారం ధరలు: 2 గ్రాములతో ఉంగరం చేయించుకోవాలంటే పక్కా లెక్క ఎంతవుతుందో తెలుసా.. బంగారం ధరలు రోజురోజుకూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారీ బడ్జెట్ పెట్టి పెద్ద పెద్ద ఆభరణాలు కొనడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. అందుకే చాలామంది చిన్న చిన్న నగలు, ముఖ్యంగా ఉంగరాలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే, తక్కువ బడ్జెట్‌లో 2 గ్రాముల బంగారు ఉంగరం చేయించుకోవాలంటే అసలు ఎంత ఖర్చవుతుంది? ఏయే చార్జీలు పడతాయి? అన్న పూర్తి వివరాలు పక్కా లెక్కలతో మీకోసం..
1 గ్రామా? 2 గ్రాములా? ఏది బెస్ట్?
ఉంగరం చేయించుకునే ముందు చాలామందికి వచ్చే సందేహం ఇది.1 గ్రాము బంగారంతో ఉంగరం చేయిస్తే.. అది చాలా సన్నగా ఉండి, త్వరగా వంగిపోవడమో లేదా విరిగిపోవడమో జరుగుతుంది. రోజువారీ పనులు చేసేవారికి ఇది అస్సలు సెట్ అవ్వదు.
అదే కొంచెం బడ్జెట్ పెంచి 2 గ్రాములతో ఉంగరం చేయించుకుంటే.. మందంగా, బలంగా ఉంటుంది. దీనిపై మీకు నచ్చిన డిజైన్ లేదా పేరు చెక్కించుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. దీర్ఘకాలం మన్నిక వస్తుంది.
ఖర్చుల పక్కా లెక్క (ఉదాహరణకు):
ఒక అంచనా ప్రకారం 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹14,500 ఉందనుకుందాం (మార్కెట్ ధరను బట్టి ఇది మారుతుంది).
బంగారం ధర: 2 గ్రాములు x ₹14,500 = ₹29,000
తయారీ కూలి (VA – 15% అంచనా): ₹29,000 పై 15% = ₹4,350 (డిజైన్‌ను బట్టి ఈ ఛార్జీ 10% నుండి 20% వరకు ఉండొచ్చు).
జీఎస్టీ (GST – 3%): మొత్తం (₹29,000 + ₹4,350) పై 3% పన్ను = ₹1,000 (సుమారుగా).
హాల్‌మార్క్ ఛార్జీలు: = ₹50
మొత్తం ఖర్చు: ₹29,000 + ₹4,350 + ₹1,000 + ₹50 = ₹34,395. అంటే.. ఒక మంచి డిజైన్ ఉన్న 2 గ్రాముల ఉంగరం కోసం సుమారు ₹34,500 నుంచి ₹35,000 బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి.
కొనే ముందు ఈ జాగ్రత్తలు మస్ట్:
ఆఫర్ల మాయలో పడకండి: కొన్ని దుకాణాలు “తయారీ కూలి లేదు (Zero Making Charges)” అని బోర్డులు పెడతాయి. కానీ, వారు బంగారం అసలు ధరను పెంచి మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనాటి మార్కెట్ ధరను ముందుగానే చెక్ చేసుకోండి.
రాళ్ల బరువు: ఉంగరానికి రాళ్లు (Stones) పొదిగితే, వాటి బరువును బంగారం బరువులో కలపకుండా విడిగా లెక్కించారో లేదో చూసుకోండి.
బిల్లు చెక్కింగ్: మీరు తీసుకునే బిల్లులో బంగారం బరువు, గ్రాము ధర, తయారీ రుసుము (VA), మరియు GST విడివిడిగా స్పష్టంగా రాసి ఉన్నాయో లేదో గమనించండి.
చివరగా, 2 గ్రాముల ఉంగరం అనేది కేవలం అలంకారం మాత్రమే కాదు, అవసరానికి ఆదుకునే చిన్నపాటి పెట్టుబడి కూడా! నాణ్యమైనది ఎంచుకుంటే, రేపు అమ్మాల్సి వచ్చినా మంచి ధర పలుకుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

