Best Jio Plans:జియో కస్టమర్లకు పండగే.. కేవలం రూ. 91 కే నెల మొత్తం అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా! ఆ టాప్ 3 ప్లాన్స్ ఇవే..
Best Jio Plans:జియో కస్టమర్లకు పండగే.. కేవలం రూ. 91 కే నెల మొత్తం అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా! ఆ టాప్ 3 ప్లాన్స్ ఇవే..ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా స్మార్ట్‌ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలంటే జేబులు ఖాళీ అవుతున్నాయి. అయితే, రిలయన్స్ జియో (Jio) తన కస్టమర్లకు ఒక అదిరిపోయే ఆఫర్లతో ఉపశమనం కలిగిస్తోంది. అత్యంత చౌకైన ధరలో, అంటే రూ. 155 కంటే తక్కువ బడ్జెట్‌లోనే అద్భుతమైన కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.
(ముఖ్య గమనిక: ఈ ప్లాన్లు ప్రత్యేకంగా ‘జియో ఫోన్’ (JioPhone / JioPhone Prima) వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇవి వర్తించవు.)
మీరు ఇంట్లో పెద్దవారికి లేదా బేసిక్ అవసరాల కోసం జియో ఫోన్ వాడుతున్నట్లయితే.. ఈ కింది టాప్ 3 చీపెస్ట్ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి!
1. జియో రూ. 152 ప్లాన్ (బెస్ట్ వాల్యూ)
నెల మొత్తం సరిపోయే బెస్ట్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఇది సరైన ఎంపిక.
వ్యాలిడిటీ: 28 రోజులు
డేటా ప్రయోజనాలు: రోజుకు 0.5GB హై-స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది. దీనికి అదనంగా మరో 1GB డేటాను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.
కాలింగ్ & మెసేజ్‌లు: దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే 300 ఉచిత SMSలు లభిస్తాయి.
అదనపు లాభాలు: జియో టీవీ, జియో క్లౌడ్ సేవలకు ఉచిత యాక్సెస్ ఉంటుంది.
2. జియో రూ. 125 ప్లాన్
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే వారికి ఇది సెట్ అవుతుంది.
వ్యాలిడిటీ: 23 రోజులు
డేటా ప్రయోజనాలు: ప్రతిరోజూ 0.5GB ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ లిమిట్ అయిపోయాక కూడా ఇంటర్నెట్ వస్తుంది కాకపోతే స్పీడ్ 64Kbps కి తగ్గిపోతుంది.
కాలింగ్ & మెసేజ్‌లు: అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ సదుపాయంతో పాటు 300 ఉచిత SMSలు పొందవచ్చు.
అదనపు లాభాలు: జియో టీవీ, జియో క్లౌడ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది.
3. జియో రూ. 91 ప్లాన్ (అతి చౌకైనది)
జియో పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత చవకైన నెలవారీ ప్లాన్ ఇది. కేవలం కాలింగ్ ఫెసిలిటీ మాత్రమే కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్.
వ్యాలిడిటీ: 28 రోజులు
డేటా ప్రయోజనాలు: ఇంటర్నెట్ వినియోగం కోసం రోజుకు 100MB డేటా చొప్పున వస్తుంది. అదనంగా మరో 200MB డేటా ఉచితంగా ఇస్తారు.
కాలింగ్ & మెసేజ్‌లు: 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 50 ఫ్రీ SMSలు అందుబాటులో ఉంటాయి.
అదనపు లాభాలు: మిగతా ప్లాన్ల మాదిరిగానే ఇందులోనూ జియో యాప్స్ (జియో టీవీ, క్లౌడ్) ఉచితంగా వాడుకోవచ్చు.
తక్కువ ఖర్చుతో నెలంతా టెన్షన్ లేకుండా మొబైల్ వాడుకోవాలనుకునే జియో ఫోన్ యూజర్లకు ఈ ప్లాన్లు నిజంగా పండగే అని చెప్పాలి!
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

