Railway Jobs :రైల్వేలో బంపర్ ఆఫర్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే 5,349 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు!
Railway Jobs :రైల్వేలో బంపర్ ఆఫర్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే 5,349 ఉద్యోగాలు.. టెన్త్ పాస్ అయితే చాలు..ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) అదిరిపోయే శుభవార్త చెప్పింది. వెస్ట్రన్ రైల్వే (Western Railway) పరిధిలో ఏకంగా 5,349 అప్రెంటిస్ (Apprentice) ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది.
దీనిలో ఉన్న అతిపెద్ద ఆకర్షణ ఏమిటంటే.. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే నేరుగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు! పదవ తరగతి, ఐటీఐ చదివిన వారు ఈ సువర్ణవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.
అర్హతలు ఏంటి? వయస్సు ఎంత ఉండాలి?
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి (టెన్త్) పాసై ఉండాలి. దీంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) సర్టిఫికేట్ (NCVT/SCVT) తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
దీనికి ఎటువంటి రాత పరీక్ష (Written Exam) లేదా ఇంటర్వ్యూ ఉండదు.అభ్యర్థులు 10వ తరగతి మరియు ఐటీఐ లో సాధించిన మార్కుల ఆధారంగా ‘మెరిట్ లిస్ట్’ తయారు చేస్తారు.మెరిట్ సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. టెన్త్, ఐటీఐలో మంచి మార్కులు ఉన్నవారికి ఇది నిజంగా జాక్‌పాట్.
దరఖాస్తు ఫీజు & ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు విధానం: కేవలం ఆన్లైన్ ద్వారా (Railway Recruitment Cell Western Railway అధికారిక వెబ్సైట్లో) మాత్రమే అప్లై చేసుకోవాలి.
ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 21
చివరి తేదీ: మార్చి 23
ఫీజు వివరాలు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంది. అంటే వీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పనిలేదు).
సికింద్రాబాద్ జోన్‌లోనూ 1,012 పోస్టులు!
తెలుగు రాష్ట్రాల యువతకు మరో గుడ్ న్యూస్. ఈ నోటిఫికేషన్‌తో పాటే.. దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని సికింద్రాబాద్ జోన్లో కూడా 1,012 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రైల్వేలో అప్రెంటిస్ పూర్తి చేస్తే.. భవిష్యత్తులో పడే రైల్వే గ్రూప్-డి (Group-D) మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక కోటా లేదా ప్రాధాన్యత లభిస్తుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆగకుండా వెంటనే అప్లై చేసుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

