BusinessToday gold rate

Gold Jewellery:2026లో బంగారం కొంటున్నారా? ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే తక్కువ ధరకే బెస్ట్ జ్యువెలరీ మీ సొంతం!

Gold Jewellery:2026లో బంగారం కొంటున్నారా? ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే తక్కువ ధరకే బెస్ట్ జ్యువెలరీ మీ సొంతం.. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, నగలు కొనాలంటేనే సామాన్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. కానీ పెళ్లిళ్లు, పేరంటాలు, గిఫ్ట్‌లు ఇవ్వడానికి గోల్డ్ కొనడం తప్పనిసరి కదా! మరి రేట్లు భారీగా పెరిగినప్పుడు ఎలా కొనాలి? బడ్జెట్‌లో అదిరిపోయే లుక్ ఇచ్చే ఆభరణాలు ఎలా ఎంచుకోవాలి?

నిపుణులు చెబుతున్న ఈ స్మార్ట్ గోల్డ్ బయింగ్ ట్రిక్స్ (Gold Buying Tips) పాటిస్తే.. మీ ఫ్యాషన్ బ్యాలెన్స్ అవ్వడమే కాకుండా, మీ పెట్టుబడి కూడా సురక్షితంగా ఉంటుంది.

జ్యువెలరీ కొనేముందు ’70/30 రూల్’ ఫాలో అవ్వండి!
నగలు కొనేటప్పుడు ఎప్పుడూ ఒకేసారి ట్రెండ్ కోసం డబ్బు ఖర్చు చేయకండి. PNG జ్యువెలర్స్ నిపుణులు సూచిస్తున్న బెస్ట్ ఫార్ములా ’70/30 రూల్’.

70% క్లాసిక్ డిజైన్లు: ఎప్పటికీ ఫ్యాషన్ అవుట్ అవ్వని సింపుల్ చైన్స్, స్టడ్స్, బ్రాస్‌లెట్స్ మీ కలెక్షన్‌లో 70% ఉండాలి. ఇవి ఐదేళ్ల తర్వాత కూడా పాతవిగా అనిపించవు.

30% ట్రెండీ డిజైన్లు: మిగిలిన 30% మాత్రమే లేటెస్ట్ ఫ్యాషన్ (స్టేట్‌మెంట్ నెక్లెస్, కలర్ జెమ్ స్టోన్స్) మీద పెట్టుబడి పెట్టండి.

ఏ క్యారెట్ బంగారం ఎందుకు బెస్ట్?
డిజైన్ ఎంత ముఖ్యమో, మీరు దేనికోసం వాడుతున్నారో దాన్ని బట్టి స్వచ్ఛతను ఎంచుకోవడం అంతకంటే ముఖ్యం:

22 క్యారెట్లు (22K): ఇది సంప్రదాయ ఆభరణాలకు బెస్ట్. పెళ్లి నగలు, తరతరాలుగా దాచుకునే ఆభరణాల కోసం వాడతారు. కానీ ఇది కాస్త సాఫ్ట్‌గా ఉంటుంది కాబట్టి రోజువారీ వాడకానికి సూట్ అవ్వదు.

18 క్యారెట్లు (18K): ఇప్పుడు కస్టమర్ల ఫేవరెట్ ఇదే! స్ట్రాంగ్‌గా ఉంటుంది. డైమండ్స్, రత్నాలు పొదిగిన ఉంగరాలు, టెన్నిస్ బ్రాస్‌లెట్స్ కోసం ఇది కరెక్ట్ ఛాయిస్.

14 క్యారెట్లు (14K): రోజూ వాడే ఆఫీస్ వేర్ చైన్లు, ఇయర్ రింగ్స్ కోసం ఇది బెస్ట్. పైగా ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. బంగారం ధరలు మండిపోతున్న ఈ టైమ్‌లో చాలామంది 14K వైపే మొగ్గుచూపుతున్నారు.

2026 లేటెస్ట్ ట్రెండ్: ‘మినిమల్ లగ్జరీ’
ఇప్పుడు బరువైన నగల కంటే.. లైట్ వెయిట్‌తో రిచ్ లుక్ ఇచ్చే ‘మినిమల్ లగ్జరీ’ ట్రెండ్ నడుస్తోంది. ఆఫీస్‌కి వెళ్లే మహిళలు బోల్డ్ హూప్స్, డైమండ్ స్టడ్స్, స్లిమ్ పెండెంట్స్ ఇష్టపడుతున్నారు. పెళ్లిళ్లలో కూడా భారీ నగల కంటే, కంఫర్ట్‌గా ఉండే ‘నియో-హెరిటేజ్’ (ట్రెడిషనల్ + మోడ్రన్) డిజైన్లకే ఓటు వేస్తున్నారు.

డబ్బు ఆదా చేయడానికి 2 స్మార్ట్ టిప్స్!
డిస్కౌంట్ల కోసం వెయిట్ చేయండి: పండగ సీజన్స్‌లో (అక్షయ తృతీయ, దసరా, దీపావళి) జ్యువెలరీ షాపులు మేకింగ్ ఛార్జీలపై (తరుగు, కూలి) భారీ డిస్కౌంట్లు ఇస్తాయి. ఆ సమయంలో ప్లాన్ చేసుకుంటే మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.

హాల్‌మార్క్ మస్ట్: డిజైన్ ఎంత బాగున్నా.. BIS హాల్‌మార్క్, HUID నంబర్ కచ్చితంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇవి ఉంటేనే భవిష్యత్తులో మీరు బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసినా, అమ్మినా పక్కాగా రీసేల్ వాల్యూ వస్తుంది.

గమనిక: ఆభరణం కొన్నప్పుడు వేసుకుంటే అందంగా కనిపించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో అది ఒక మంచి పెట్టుబడిగా కూడా ఉపయోగపడాలి. కాబట్టి ఆచి తూచి అడుగు వేయండి!

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/