Gold Necklace:20 గ్రాముల గోల్డ్ నెక్లెస్ కొంటున్నారా? షాపులో బిల్లు ఎలా వేస్తారో ఈ లెక్కలు ముందే తెలుసుకోండి!
Gold Necklace:20 గ్రాముల గోల్డ్ నెక్లెస్ కొంటున్నారా? షాపులో బిల్లు ఎలా వేస్తారో ఈ లెక్కలు ముందే తెలుసుకోండి..బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే పేపర్‌లో లేదా టీవీలో చూసిన రేటుకే నగలు వస్తాయని అనుకుంటే పొరపాటే. మనం చూసే అసలు ధరకు మేకింగ్ చార్జీలు, వేస్టేజ్ (తరుగు), జీఎస్టీ వంటివి అదనంగా కలుస్తాయి.
ఉదాహరణకు, మీరు 20 గ్రాముల (రెండు తులాల) గోల్డ్ నెక్లెస్ కొంటే జేబుకు ఎంత ఖర్చవుతుందో ఇక్కడ క్లియర్‌గా లెక్కలు వేసి చూద్దాం. జువెలరీ షాపుకి వెళ్లే ముందే ఈ లెక్కలపై ఓ లుక్కేయండి.
అసలు రేటు ఎంత? (ఉదాహరణకు)
ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1,44,000 ఉందనుకుందాం.అలాంటప్పుడు మీరు కొనాలనుకుంటున్న 20 గ్రాముల (2 తులాల) బంగారం అసలు విలువ: రూ. 2,88,000 అవుతుంది.
అదనపు ఛార్జీల క్యాలిక్యులేషన్ ఇలా..
దీనిపై మేకింగ్ చార్జ్ 10 శాతం, వేస్టేజ్ 5 శాతం వేస్తున్నారని అనుకుందాం. అప్పుడు లెక్క ఎలా మారుతుందంటే:
తయారీ కూలీ (Making Charges – 10%): అసలు ధర రూ. 2,88,000 లో 10% అంటే రూ. 28,800.
తరుగు (Wastage – 5%): రూ. 2,88,000 లో 5% అంటే రూ. 14,400.
మొత్తం కూడితే: అసలు ధర (రూ. 2,88,000) + మేకింగ్ (రూ. 28,800) + వేస్టేజ్ (రూ. 14,400) = రూ. 3,31,200.
దీనికి జీఎస్టీ (GST) అదనం!
పైన వచ్చిన మొత్తంపై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి.
రూ. 3,31,200 పై 3% జీఎస్టీ అంటే అదనంగా రూ. 9,936 పడుతుంది.
ఫైనల్ బిల్లు ఎంతవుతుంది?
మొత్తం (నగ ధర + మేకింగ్ + వేస్టేజ్) : రూ. 3,31,200
జీఎస్టీ (3%) : రూ. 9,936
ఫైనల్ గా మీరు చెల్లించాల్సిన మొత్తం : రూ. 3,41,136
గమనిక: చూశారుగా! మార్కెట్ ధర ప్రకారం బంగారం విలువ 2.88 లక్షలే అయినా.. అదనపు ఛార్జీల వల్ల బిల్లు సుమారు రూ. 3.41 లక్షలకు చేరింది. అయితే డిజైన్‌ను బట్టి మేకింగ్, వేస్టేజ్ ఛార్జీల్లో షాపుల వారీగా మార్పులు ఉండొచ్చు.ఈసారి మీరు బంగారం కొనడానికి వెళ్ళేముందు ఈ లెక్కలు గుర్తుపెట్టుకోండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

