Beauty Tips

Hair Fall Tips:జుట్టు రాలుతోందని టెన్షనా? ఒక అరటిపండుతో ఇలా చేస్తే.. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం ఖాయం!

Hair Fall Tips:జుట్టు రాలుతోందని టెన్షనా? ఒక అరటిపండుతో ఇలా చేస్తే.. మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడం ఖాయం..ప్రస్తుత రోజుల్లో వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా.. ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది జుట్టు రాలే సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హెయిర్ ఫాల్ తో పాటు చుండ్రు, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలకు ఖరీదైన షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా?

అయితే మన ఇంట్లో ఉండే కేవలం మూడు సహజసిద్ధమైన పదార్థాలతో అద్భుతమైన హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వాడితే మీ జుట్టు రాలడం ఆగిపోయి, నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.

ఈ మ్యాజిక్ హెయిర్ ప్యాక్ కు కావాల్సిన పదార్థాలు:
బాగా పండిన అరటిపండు: 1
కాఫీ పొడి: 1 స్పూన్
పెరుగు: 2 స్పూన్లు

తయారీ మరియు వాడే విధానం ఎంతో సులువు:
ముందుగా అరటిపండు తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలి.అందులోనే ఒక స్పూన్ కాఫీ పొడి, రెండు స్పూన్ల పెరుగు వేసి.. మెత్తని పేస్ట్‌లా (Smooth paste) మిక్సీ పట్టుకోవాలి.ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్‌ను తల కుదుళ్ల నుండి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి.

ప్యాక్ వేసుకున్న అరగంట (30 నిమిషాల) తర్వాత.. కుంకుడుకాయలతో లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేస్తే.. కొద్ది రోజుల్లోనే మీ జుట్టులో అద్భుతమైన మార్పును గమనిస్తారు.

ఈ ప్యాక్ ఎందుకు అంత పవర్‌ఫుల్ అంటే?
అరటిపండు మ్యాజిక్: అరటిపండులో ఉండే పొటాషియం, ప్రోటీన్లు, సహజ నూనెలు, విటమిన్లు జుట్టు రాలకుండా అడ్డుకుంటాయి. ఇది ఒక బెస్ట్ నేచురల్ కండిషనర్‌లా పనిచేసి జుట్టును స్మూత్‌గా మారుస్తుంది.

పెరుగుతో చుండ్రు పరార్: పెరుగు తల మీద చర్మాన్ని (Scalp) ఎండిపోకుండా తేమగా ఉంచుతుంది. దీనివల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు పూర్తిగా మాయమవుతాయి.

కాఫీ పొడితో నిగారింపు: కాఫీ పొడి కుదుళ్లకు రక్తప్రసరణను మెరుగుపరిచి, జుట్టు మంచి రంగుతో మెరిసేలా చేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/