Job Alert:రోజంతా సోషల్ మీడియా వాడుతున్నారా? అయితే నెలకు రూ.50,000 సంపాదించే బంపర్ ఆఫర్ మీకోసమే!
Job Alert:రోజంతా సోషల్ మీడియా వాడుతున్నారా? అయితే నెలకు రూ.50,000 సంపాదించే బంపర్ ఆఫర్ మీకోసమే..రీల్స్ చూస్తూ, సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. సోషల్ మీడియాపై మీకున్న ఆసక్తినే కెరీర్‌గా మలచుకునే అద్భుత అవకాశం వచ్చింది. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌తో ఏఐ టూల్స్ వాడటం తెలిస్తే చాలు.. నెలకు రూ. 50 వేల వరకు సంపాదించవచ్చు.
ప్రముఖ డిజిటల్ ఎడ్యుకేషన్ సంస్థ అయిన ఐఐడీఈ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (IIDE Education) సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై ఆసక్తి ఉన్నవారికి ఇది బెస్ట్ ఛాన్స్.
అసలు ఏం పని చేయాలి? (Job Role)
కంపెనీకి కొత్త ఫాలోవర్లను తీసుకురావడం, ఉన్నవారిని ఎంగేజ్ చేయడం మీ ప్రధాన బాధ్యత. దీనికోసం కింది పనులు చేయాల్సి ఉంటుంది:
ఏఐ టెక్నాలజీ (AI Tools): ఏఐ టూల్స్ ఉపయోగించి ఆకర్షణీయమైన ఇమేజ్‌లు, వీడియోలు క్రియేట్ చేయడం.
కాపీ రైటింగ్: ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సోషల్ మీడియా పోస్టులకు కంటెంట్ రాయడం.
డేటా అనలిటిక్స్: మీ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ఎలా పనిచేస్తున్నాయో విశ్లేషించడం.
ట్రెండ్స్: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ బ్రాండ్ వాల్యూ పెంచడం.
యూజర్ల కామెంట్స్, మెసేజ్‌లకు రిప్లై ఇస్తూ ఎంగేజింగ్‌గా ఉంచడం.
ఎవరు అప్లై చేసుకోవచ్చు? (Eligibility)
ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ (Degree) పాసై ఉండాలి.సంబంధిత రంగంలో కనీసం 1 ఏడాది పని అనుభవం ఉండాలి.ఈ ఉద్యోగాలకు ఎలాంటి వయోపరిమితి (Age Limit) లేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం.. ఇతర బెనిఫిట్స్ (Salary & Perks)
ప్యాకేజీ: అభ్యర్థి స్కిల్స్, అనుభవాన్ని బట్టి ఏడాదికి రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారు. అంటే నెలకు సులభంగా రూ. 50,000 వరకు అందుకోవచ్చు.
పని దినాలు: వారంలో కేవలం 5 రోజులు మాత్రమే పని ఉంటుంది (5 Days Working0 షిఫ్టుల్లో వర్క్ చేసుకునే సదుపాయం కూడా కంపెనీ కల్పిస్తోంది.
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 5 పోస్టులు
చివరి తేదీ: 2026, ఏప్రిల్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఎలా అప్లై చేయాలి?: ఆసక్తి గల అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
[కింద లింక్ ని copy చేసి క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి]
https://internshala.com/job/detail/remote-social-media-executive-job-at-iide-education-private-limited1772774622
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

