BSNL:BSNL కస్టమర్లకు అదిరిపోయే ఫీచర్.. మీ ఫోన్ నంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోండిలా!
BSNL:BSNL కస్టమర్లకు అదిరిపోయే ఫీచర్.. మీ ఫోన్ నంబర్ చెప్పకుండానే రీఛార్జ్ చేసుకోండిలా.. డిజిటల్ యుగంలో మన మొబైల్ నంబరే మన ఐడెంటిటీ. బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మొబైల్ రీఛార్జ్ వరకు ప్రతిచోటా ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందే.
కానీ, పబ్లిక్ ప్రదేశాల్లో లేదా షాపుల్లో రీఛార్జ్ చేసుకునేటప్పుడు మన నంబర్ అపరిచితులకు ఇవ్వడం, ముఖ్యంగా మహిళల భద్రత, గోప్యత (Privacy) పరంగా కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ‘కవచ్ నంబర్’ (Kavach Number).
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని BSNL ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఇంతకీ ఈ కవచ్ నంబర్ ఏంటి? దీన్ని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకోండి.
కవచ్ నంబర్ (Kavach Number) అంటే ఏంటి?
ఇది BSNL అందిస్తున్న ఒక ప్రత్యేకమైన సదుపాయం. దీని ద్వారా యూజర్లకు తాత్కాలికంగా వాడుకునేందుకు ఒక 10 అంకెల మొబైల్ నంబర్ కేటాయిస్తారు. ఇది మీ ఒరిజినల్ (అసలు) ఫోన్ నంబర్‌కు లింక్ అయి ఉంటుంది. మీరు బయట ఎక్కడైనా రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ పర్సనల్ నంబర్ చెప్పకుండా, ఈ ‘కవచ్ నంబర్’ ఇస్తే సరిపోతుంది. దీని వల్ల మీ అసలు నంబర్ ఎవరికీ తెలియకుండా సేఫ్‌గా ఉంటుంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
కవచ్ నంబర్ అనేది మీ అసలు నంబర్‌కు ఒక ‘సెక్యూరిటీ లేయర్’ లాగా పనిచేస్తుంది.షాపులో రీఛార్జ్ చేసేటప్పుడు మీరు ఈ తాత్కాలిక 10 అంకెల కవచ్ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి.వాళ్లు ఆ నంబర్‌కు రీఛార్జ్ చేయగానే, సిస్టమ్ దాన్ని గుర్తించి ఆటోమేటిక్‌గా మీ అసలు మొబైల్ నంబర్‌కు ఆ రీఛార్జ్ బెనిఫిట్స్ ను బదిలీ చేస్తుంది.
అంటే మీ నంబర్ ఎవరికీ షేర్ చేయకుండానే సులభంగా రీఛార్జ్ అయిపోతుందన్నమాట!
కవచ్ నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
ఈ సదుపాయాన్ని పొందడం చాలా సులభం. ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో BSNL Self Care యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ నంబర్‌తో యాప్‌లో లాగిన్ అవ్వండి.మెనూలో మీకు ‘Kavach Number’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి.
అక్కడి నుంచి మీరు మీకోసం ఒక తాత్కాలిక నంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు.ఈ నంబర్ మీకు SMS రూపంలో కూడా వస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

