మీ పర్సులో డబ్బులు నిలవట్లేదా? అయితే అందులో వెంటనే ఈ మార్పులు చేయండి.. మనీకి లోటే ఉండదు!
నెల ప్రారంభంలో జీతం రాగానే పర్సు నిండిపోతుంది.. కానీ నెలఖారు వచ్చేసరికి ఖాళీ అయిపోతుందా? ఎంత సంపాదించినా డబ్బులు నిలవట్లేదా? అయితే దానికి కారణం మీ రోజువారీ అలవాట్లే కావచ్చు. ముఖ్యంగా మనం వాడే పర్సు (Wallet) విషయంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి.
లక్నోకు చెందిన ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు డాక్టర్ ఉమాశంకర్ మిశ్రా సూచనల ప్రకారం.. పర్సు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పర్సులో ఈ తప్పులు అస్సలు చేయకండి:
చిరిగిన పర్సు వద్దు: పర్సు ఎప్పుడూ శుభ్రంగా, చిరిగిపోకుండా ఉండాలి. పాడైన లేదా పాత పర్సును వాడటం వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. పర్సు చిరిగితే వెంటనే కొత్తది మార్చడం మంచిది.
రామ తులసి vs కృష్ణ తులసి: ఈ రెండింటిలో ఏది శ్రేష్ఠం? వీటి మధ్య తేడాలను ఎలా గుర్తించాలో తెలుసా?
చెత్త కాగితాలు ఉంచొద్దు: చాలామంది పర్సులో పాత బిల్లులు, ఏటీఎం రసీదులు, పనికిరాని కార్డులు కుక్కి మరీ పెడుతుంటారు. ఇలా అనవసరమైన చెత్తను పర్సులో ఉంచితే ఆర్థిక భారం పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
పర్సులో డబ్బును ఆకర్షించే అద్భుతమైన వస్తువులు ఇవే:
ఖర్చులు తగ్గి, పర్సులో డబ్బు ఎప్పుడూ నిండుగా ఉండాలంటే ఈ కింద చెప్పిన వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి.
పసుపు కలిపిన బియ్యం: గురువారం రోజున పసుపు కలిపిన (అక్షతలు) కొన్ని నిండు బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి.
గోమతి చక్రం: వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో ఒక ‘గోమతి చక్రం’ ఉంచుకోవడం చాలా శుభప్రదం. ఇది ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుంది.
పచ్చ యాలకులు: బుధవారం పూజ చేసిన తర్వాత రెండు పచ్చ యాలకులను పర్సులో పెట్టుకుంటే.. ధన ప్రవాహం మెరుగవుతుందని నమ్మకం.
లక్ష్మీదేవి ఫోటో: సంపదకు ప్రతీక అయిన లక్ష్మీదేవి ఫోటో పర్సులో ఉండటం చాలా మంచిది. ముఖ్యంగా అమ్మవారు తామరపువ్వుపై కూర్చున్న చిత్రం ఉండటం మరింత శుభప్రదం.
వెండి ముక్క: సోమవారం పూజ అనంతరం ఒక చిన్న వెండి ముక్కను పర్సులో పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది.
పర్సు రంగు కూడా ముఖ్యమే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వ్యక్తులు తమ రాశిని బట్టి పర్సు రంగును ఎంచుకోవాలి. కొందరికి ఎరుపు, కొందరికి నలుపు లేదా బ్రౌన్ కలర్ అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ పర్సు నిండా డబ్బులు ఉన్నప్పుడు ఇతరుల ముందు ఎక్కువగా ప్రదర్శించకపోవడం (షో ఆఫ్ చేయకపోవడం) మంచిది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

