Movies

ఈ పాపను గుర్తుపట్టారా? ఆమె ప్రస్తుతం ఎక్కడ,ఎలా ఉందో, ఆమె భర్త ఎవరో తెలుసా?ఆమె తాత ఒక ప్రముఖ వ్యక్తి ?

ఐదు సంవత్సరాల వయస్సులోనే సినీ మాయ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఆమె ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ కు ఉండే క్రేజ్ ని సంపాదించింది. అందరి మనస్సులో చెరగని ముద్ర వేసుకుంది. ఆమె ఎవరో కాదు సుదీప పింకీ. సుదీప కంటే పింకీ అంటేనే అందరికి తెలుస్తుంది. సుదీప అసలు పేరు సుదీప రాపర్తి. 1987 లో పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టింది.

1992 లో మోహన్ బాబు హీరోగా నిర్మించిన యమ్. ధర్మరాజు M.A సినిమాలో రంభ చెల్లెలిగా సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటికి సుదీప వయస్సు 5 సంవత్సరాలు మాత్రమే.

ఆ తర్వాత 2001 లో వెంకటేష్,ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లెలుగా నటించింది. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర పేరు పింకీ.

ఆ పాత్రలో ఆమె నటనకు,డైలాగ్స్ కి ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు. ఈ సినిమాలో ఆమె వెంకటేష్ ని వెంకటేశ్వర్లు అంటూ అట పట్టించటం అందర్నీ ఆకట్టుకుంది.

ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుదీప పింకిగానే గుర్తుండిపోయింది. దాంతో ఆమె పేరు ఏకంగా సుదీప పింకీగా మారిపోయింది. ఆమె మూడు సంవత్సరాల వయస్సులో నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించింది.

పింకి మంచి క్లాజికల్ డాన్సర్. సుదీప తండ్రి పేరు రాపర్తి సూర్యనారాయణ. తల్లి సత్యవతి. వీరిద్దరూ మంచి క్లాసికల్ డాన్సర్స్. వీరు సత్యశ్రీ అనే డాన్స్ అకాడమీని నడుపుతున్నారు.

పింకీ తాతగారి పేరు శ్రీ కిలాడి సత్యం గారు. అయన కూడా మంచి డాన్సర్. అయన ఏకధాటిగా 42 గంటల పాటు డాన్స్ చేసి రికార్డ్ కూడా నెలకొల్పారు. ఇంత మంచి డాన్సర్ లు ఉన్న ఇంటిలో పుట్టిన సుదీప చిన్నతనం నుండి డాన్స్ నేర్చుకుంది.

ఆమె సినిమాల్లో కన్నా ముందుగా దేశ విదేశాల్లో ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. సినిమాల్లో ఎక్కువగా చెల్లి పాత్రలే వచ్చాయి. అల్లుడుగారు వచ్చారు,నీ స్నేహం,గుడుంబా శంకర్ ,బొమ్మరిల్లు,మిస్టర్ ఫరఫెక్ట్ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది.

ఆమె తమిళ్ సినిమాల్లో కూడా చెల్లి పాత్రలను వేసింది. ఆమె దాదాపుగా 30 సినిమాల్లో నటించింది. ఆమె 2014 తర్వాత కొంతకాలం కన్పించకుండా పోయింది. ఆ తర్వాత పింకీ శ్రీరంగనాథ్ తో వివాహం జరిగింది. ఆమెకు ఇప్పుడు ఒక కూతురు ఉంది.

పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు తగ్గటంతో సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.