బిగ్ బాస్ 2 గ్లామర్ డాల్ దీప్తి సునైనా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నిన్న రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ సీజన్ 2 నాని హోస్టింగ్ తో చాలా గ్రాండ్ గా ప్రారంభము అయింది. ఈ సీజన్ లో 13 మంది సెలబ్రెటీలు,ముగ్గురు సామాన్యులను తీసుకున్నారు. 13 మంది సెలబ్రెటీలలో గ్లామర్ డాల్ దీప్తి సునైనా ఒకరు. ఆమె గురించి వివరంగా తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌కి బాగా పరిచయమైన ఈ గ్లామర్ డాల్ అనేక డబ్ స్మాష్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్ లు చేస్తూ సినిమాల్లో అవకాశాన్ని సంపాదించింది. నిఖిల్ హీరోగా వచ్చిన ‘కిరాక్ పార్టీ’ గ్యాంగ్‌లో దీప్తి సునైనా ఒకరు.
హైదరాబాద్ కి చెందిన 20 సంవత్సరాల దీప్తి సునైనా హైదరాబాద్‌లో స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. సినిమాల మీద ఉన్న ఆసక్తితో మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ, డబ్ స్మాష్ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ పాపులారిటీని సంపాదించి నిదానంగా సినిమాల్లోకి ప్రవేశించింది.
ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ మిలియన్ల ఫాలోయర్స్ ని రాబట్టింది. యూ ట్యూబ్ లో ఒక వీడియో అప్ లోడ్ చేసిందంటే రచ్చ రచ్చే. రామ్ చరణ్,సమంతా జోడిగా వచ్చిన రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే, రంగమ్మా.. మంగమ్మా’ పాటలకు డాన్స్ చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే యూ ట్యూబ్ షేక్ అయ్యిపోయింది.
అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి ‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట’ పాటకు స్టెప్స్ వేసి అదరకొట్టేసింది. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ని ఎలా షేక్ చేస్తుందో చూడాలి.